Read News in Telugu Language
adsdaksha

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు ..

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జనవరి 5

– తెలంగాణ ఉద్యమకారులు వలసాల వెంకట రామారావు, డాక్టర్ దుస్సా సమ్మయ్య..

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయిస్తానని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరచడం నేడు ప్రజా పాలన  ( prajapalana ) దరఖాస్తుల స్వీకరణలో ఉద్యమకారులకు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ( bhadradri kottagudem district ) మణుగూరు మండల తెలంగాణ ( telangana )  ఉద్యమకారులు వలసాల వెంకట రామారావు, డాక్టర్ దుస్సా సమ్మయ్య అన్నారు.

Hospital

read also : ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ సంక్రాంతిలోపే పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్..

శుక్రవారం ప్రజా పాలన దరఖాస్తులను స్థానిక అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలుగా ఉద్యమ పార్టీగా చెప్పుకొనే బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఉద్యమకారులను గుర్తించడంలో విఫలమైందన్నారు. నేడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను గుర్తించి అవకాశాలు కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.