Read News in Telugu Language
adsdaksha

దళితులను అమ్మపేరు చెప్పి, బొమ్మ పేరు చెప్పి ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు..

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నవంబర్ 5

ఎలక్షన్ లు వచ్చిన వెంటనే ఆగమాగం కావద్దు.. ఆలోచించి ఓటేయాలి..

బీఆర్ఎస్, కేసీఆర్ ఉన్నదే తెలంగాణ సమాజం కోసం ..

– కొత్తగూడెం ప్రజా ఆశీర్వాద సభలో కేసిఆర్..

ఎలక్షన్లు వచ్చిన వెంటనే ఆగమాగం, అడివడివి కావడం, బూతులు తిట్టుకోవడం, అబద్ధాలు చెప్పడం, సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడటం, ఎటుపడితే అటు అబంఢాలు వేయడం, మోసపూరిత వాగ్ధానాలు చేయడం ఇది మన దేశంలో జరిగే తంతు
అని సీఎం కేసిఆర్ ( cm kcr ) అన్నారు. దేశంలో రాజకీయ పరిణితి రావాలన్నారు. నాయకులు చెప్పే మాటలు పదిమందితో చర్చించాలన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం ( bhadradri kottagudem ) జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భద్రాద్రి సీతారామచంద్రస్వామి కొలువుదీరిన ఈ పావన భూమికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా అన్నారు.

భద్రాద్రి రాముడు నడయాడిన నేల గనుకే జిల్లా పేరు కూడా స్వామి వారి పేరుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని ఏర్పాటు చేసుకున్నాం అన్నారు. ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి మన దేశంలో రాలేదని పరిణితి వచ్చిన దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. ఎలక్షన్లు వచ్చిన వెంటనే ఆగమాగం, అడివడివి
కావడం మానేయాలన్నారు. ఓటు ప్రజల చేతిలో ఉండే వజ్రాయుధం అని, దీనిని ఆగమాగంగా వేస్తే ఐదు సంవత్సరాల పాటు ఆగమైపోతాం అన్నారు. ఎవరు గెలవాలని ప్రజలు కోరుకుంటారో వాళ్లు గెలిస్తేనే అదే ప్రజల గెలుపు అవుతుందన్నారు. ప్రజలు గెలిచే రోజు వచ్చిన నాడు ప్రజల కష్టాలు తీరుతాయని ఆలోచించి ఓటేయ్యాలన్నారు.

read also : పెద్దాయన మతి బ్రమించినట్లు మాట్లాడుతున్నారు… ప్రజల్ని మభ్యపెట్టి గెలవాలనుకోవడం సబబు కాదు..

బీఆర్ఎస్ తరపున వనమా వెంకటేశ్వర్ రావు పోటీ చేస్తున్నారని సీఎం కేసిఆర్ అన్నారు. ఇతర పార్టీల నుంచి ఎవరో ఒకరు వస్తారు. అభ్యర్థి గుణగణాలు తెలుసుకోవాలి. మంచి చెడ్డా చూడాలి ప్రతి అభ్యర్థి వెనుక ఏదో ఒక పార్టీ ఉంటది. పార్టీ వైఖరి, నడవడిక, చరిత్ర ఏంటి ? ప్రజలకు మేలు చేసిన పార్టీ ఏది? చేయబోయేదేది అనే అంశాలను ఆలోచించాలన్నారు. తెలంగాణ తెచ్చిన వాడిగా తెలంగాణ సమాజం బాగుండాలనే హృదయం నిండా ఆకాంక్షతో నేను చెబుతున్నాను.
తమాషాకు ఓటేస్తే చాలా గందరగోళం జరుగుతుందని హెచ్చరించారు.

సింగరేణి కి 134 సంవత్సరాల చరిత్ర ఉన్నదని కేసిఆర్ అన్నారు. తెలంగాణ కొంగు బంగారం మన గనులు .. సింగరేణి 100 కు వందశాతం మనకే ఉండేది.
చేతకాని కాంగ్రెస్ దద్దమ్మలు కేంద్ర ప్రభుత్వం వద్ద అప్పులు తెచ్చి 40 ఏండ్లు తిరిగి చెల్లించలేదు. యువకులకు తెలియదు. దాంతో కేంద్రానికి 49 శాతం వాటా వచ్చింది. లేకుంటే మన గనులు మనకే ఉండేవి. ఇవి నిజాం నాటి గనులు. దీనివల్ల నష్టం జరిగింది. అప్పనంగా కేంద్రానికి కట్టబెట్టారు. సింగరేణి యొక్క నడకనే మార్చినం. కాంగ్రెస్ పరిపాలనలో సింగరేణి నష్టాల్లో ఉండేది.. తెలంగాణ వచ్చిన వెంటనే 3శాతం తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చాం అని తెలిపారు.

Hospital

సింగరేణి కంపెనీ టర్నోవర్ కాంగ్రెస్ రాజ్యంలో 11 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉండేదని కేసిఆర్ తెలిపారు. ఇప్పుడు 33 వేల కోట్లకు తీసుకుని పోయాం
అన్నారు. సింగరేణి లాభాలు రూ. 419 కోట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు లాభాలు 2184 కోట్లకు తీసుకెళ్లాం. గతంలోదసరాకు 60,70 కోట్లు ఉండేది. మనం ఈ దసరాకు సింగరేణి కార్మికులకు పంచినటువంటి లాభం రూ.700 కోట్లు. తెలంగాణ రాకపూర్వం 6400 ఉద్యోగాలు వచ్చాయి. వచ్చినంక తొమ్మిదన్నరేళ్లుగా నూతనంగా 19463 మందికి ఉద్యోగాలు ఇచ్చినం డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగొట్టిందే కాంగ్రెస్ యూనియన్, సీపీఎం, సీపీఐ యూనియన్ లు. మనం వచ్చినాక 15256 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చినం. గతంలో కార్మికులు చనిపోతే లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాం. ఈ రోజు 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటుంన్నం. డిపెండెంట్ ఉద్యోగం తీసుకోకుంటే రూ.25 లక్షలు ఇస్తున్నాం అని పేర్కొన్నారు.

10 లక్షల గృహాలకు వడ్డిలేని రుణం ఇస్తున్నాం. సింగరేణి స్థలాలలో నివాసముంటున్న 22 వేల మందికి పట్టాలు ఇచ్చాం అని కేసిఆర్ తెలిపారు.
గోదావరి ఒడ్డున జైపూరు వద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టుకున్నాం. దీని పీఎల్ఎఫ్ దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది. 50 ఏండ్లు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చినారు. బీఆర్ఎస్ కు అధికారం ఇచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటికీ ఇప్పటికీ అభివృద్ధిని గమనించాలి. తేడా గమనించాలి. తెలంగాణ వచ్చిన నాటి పరిస్థితి మీకు తెలుసు. కరెంటు ఉత్పత్తి చేసే కొత్తగూడెంలో కరెంటు కోతలు ఉండేవి. మంచినీళ్లు లేవు. పేదల గతి ఘోరంగా ఉండేది. ముందు కరెంటు బాధ్యత తీసుకున్నాం. ఇవ్వాల కరెంటు బాధలు లేవు. యాదాద్రి పవర్ ప్లాంటు పూర్తయితే 4 వేల మెగావాట్ల విద్యుత్ అదనంగా వస్తుందన్నారు. కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ వచ్చిందని కేసిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కిడ్ని బీమారి ఉంటే ఇక్కడే డయాలసిస్ కేంద్రాలు ఏర్పటు చేసినం అన్నారు. 16761 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చుకున్నాం. 4500 కుటుంబాలకు లాభం జరిగింది. ఆదివాసీ గిరిజనులపై కేసులు ఎత్తివేసాం. ఇచ్చిన పట్టాలకు రైతుబంధు, రైతుబీమా కల్పించాం . 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాని పని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు పైకి వచ్చినాయి.
గతంలో గోదావరి చూసి సంతోషపడే వాళ్లం కానీ చారెడు నీళ్లు రాకపోయేవి.
సీతారామ ప్రాజెక్టు 75 శాతం పూర్తయింది. దీనికి నేనే వచ్చి ప్రారంభం చేస్తాను అన్నారు.

read also : సొంత పార్టీలకు జెలక్ ఇస్తున్నట్లు చేస్తున్న సరదా రాయుళ్లు ..

బీఆర్ఎస్ నడక ఏందో మీకు తెలుసు. పేద ప్రజలకోసం ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు. రైతుబంధు, దళితబంధు గురించి మీకు తెలుసు..
దళితులను ఎంతసేపు అమ్మపేరు చెప్పి, బొమ్మ పేరు చెప్పి ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు. దళితబంధు నిరంతరాయంగా కొనసాగుతుంది. వారిని ఉద్దరించేవరకు కొనసాగుతుంది. అమ్మఒడి వాహనాలు పెట్టి, కేసీఆర్ కిట్ పెట్టిన తర్వాత వైద్య రంగంలో దోపిడి తగ్గిపోయింది. 1015 రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టుకున్నాం. అన్ని వర్గాల వారికోసం వీటిని ఏర్పాటు చేసుకుని సత్ఫలితాలను తీసుకువస్తున్నాం. ఈ ప్రగతి ఏదైతే జరుగుతున్నదో. దీనిని బేరీజు వేయండి. రైతుల గురించి ఏం జరుగుతుంది. సంక్షేమం ఏ విధంగా ఉంది. అన్ని విషయాలు ఆలోచించండి అని కోరారు.

మాజీ ఎమ్మెల్యే కోనేరు నాగేశ్వరావు అబ్బాయి చిన్ని వచ్చి పార్టీలో చేరారు. స్వాగతం చెబుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు పది ఏళ్లలో నల్లబ్యాడ్జీలు ధరించలేదు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పీఆర్సీ అమలు చేసినం. బీఆర్ఎస్, కేసీఆర్ ఉన్నదే తెలంగాణ సమాజం కోసం
. అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిమీద ముందుకు సాగుదాం. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే కరువు అనేది మనకు రానేరాదు. కొత్తగూడెం బంగారు తునక అవుతది.
వనమా వార్డు నంబరు నుంచి మంత్రి వరకు ఎదిగారు. కేసీఆర్ ముఖం చూసి వనమాకు ఓటు వేయాలన్నారు. ఆయన మంచి వ్యక్తి. ఆయన వ్యక్తిగత పని ఆయన ఏనాడు అడుగలేదు. ఇటువంటి మంచి వ్యక్తి కొనసాగుతే కొత్తగూడెం బాగుపడుద్ది
అని వ్యాఖ్యానించారు.

ఎన్నికల తర్వాత మీ వద్దకు వచ్చి ఇక్కడే రివ్యూలు చేస్తానని కేసిఆర్ అన్నారు. అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిద్దాం అన్నారు.
భారీ మెజారిటీతో వనమా ను గెలిపించాలని కోరారు. సభలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ నామా నాగేశ్వర రావు, ఎంపీ బండి పార్థసారథి రెడ్డి. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ , తెల్లం వెంకట్రావు, టీబీజీకేఎస్ నాయకులు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.