Read News in Telugu Language
adsdaksha

దసరా కానుకగా భగవంత్ కేసరి ..

దక్ష సినిమా న్యూస్:

ట్రైలర్ రిలీజ్ కి టైం ఫిక్స్ ..

నంద‌మూరి బాల‌కృష్ణ, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన భగవంత్ కేసరి మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ కాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘భగవంత్ కేసరి’ ( bhagavanth kesari ) ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ప్రమోషన్స్ కూడా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే మూవీలోని సాంగ్స్ కూడా ఇప్పటికే రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడానికి టైం ఫిక్స్ చేశారు.

read also : గరళకంఠుడి పాత్రలో పాన్ ఇండియా స్టార్.. ప్రభాస్

Hospital

ఈ మూవీ దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ మూవీ స్క్రీన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. తండ్రి కూతురు అనుబంధంతో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుందని తెలుస్తుంది. జైలర్ అండ్ విక్రమ్ తరహాలోనే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందట. అలాగే అనిల్ రావిపూడి మార్క్ కామెడీ కూడా మూవీలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయనుంది.

read also : పేదల పాలిట వరం గృహలక్ష్మి పథకం..

కాగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ ఈ నెల 8న బ్లాస్ట్‌ కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈసారి అంచనాలకు మించి బాలయ్యని ఒక సరికొంత యాంగిల్ లో చూడబోతున్నారు అంటూ మేకర్స్ తెలియజేస్తున్నారు. కాగా ఈ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. వరంగల్ లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించనున్నారట. అయితే నిర్మాతలు మాత్రం ఈ విషయాన్ని తెలియజేయలేదు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.