Read News in Telugu Language
adsdaksha

భారత్ జోడో న్యాయ్ యాత్రకు సిద్ధమైన రాహుల్ గాంధీ..

దక్ష న్యూస్, న్యూఢిల్లీ: జనవరి 4

మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ మరో యాత్రకు రెడీ అయ్యింది. భారత్ జోడో యాత్ర తరహాలో కొత్తగా మరో యాత్ర చేపట్టనుంది.

ఈ యాత్ర కు తొలుత భారత్ న్యాయ్ యాత్ర అని నామకరణం చేయాలనుకున్నా, ఇప్పుడు స్వల్ప మార్పు చేస్తూ, భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nay Yatra) అని నామకరణం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వం వహించే ఈ యాత్రకు వివరాలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ గురువారం వెల్లడించారు.

Read also: 2వ టెస్ట్ మ్యాచ్లో సౌతాఫ్రికాపై భారత్ విజయం..

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో గురువారం పార్టీ కీలక సమావేశం జరిపి, పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు పాల్గొని, భేటీలో చర్చించి, యాత్ర పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు జైరాం రమేష్ తెలిపారు.

Hospital

“భారత్ జోడో న్యాయ్ యాత్రకు” ఇండియా కూటమి నేతలందరినీ ఆహ్వానించినట్లు తెలిపారు.
జనవరి 14న ప్రారంభమయ్యే ఈ యాత్ర మార్చి 30న ముగుస్తుంది. 66 రోజులపాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాలు దాదాపు 6713 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనుంది. దాదాపు 100 లోక్‌సభ స్థానాల్లో చేపట్టే ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజలతో రాహుల్ గాంధీ మాట్లాడతారని జైరాం రమేష్ తెలిపారు.

Read also: అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల షెడ్యూల్ వచ్చేసింది..

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర.. అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో సాగనుంది.

తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. భారత్ జోడో న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగనుంది.

అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. గతంలో రాహుల్ గాంధీ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 136 రోజులపాటు 12 రాష్ట్రాల్లో దాదాపు 4500 కిలోమీటర్ల మేర జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రాహుల్ యాత్ర ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

Leave A Reply

Your email address will not be published.