Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్ నెల రోజుల పాలన భేష్.. సామాన్యులకు అందుబాటులో సీఎం రేవంత్ రెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్ : జనవరి 13

తమ ప్రభుత్వ నెల రోజుల పాలన అద్భుతంగా ఉందని, ముఖ్యమంత్రి నుండి ఎమ్మెల్యేల వరకు నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రజలతో మమేకమై పనిచేస్తూ ప్రజాపాలన లో భాగ్యస్వాములవుతున్నామన్నామని, కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ ( mahabubnagar ) జిల్లా అధ్యక్షులు, దేవరకద్ర ( devakadra ) ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ( madhusudhanreddy ) అన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ( congress ) కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ నెల రోజుల పాలన, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ( bharat jodo nyay yatra ) సందర్భంగా జిల్లా అధ్యక్షులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలు సామాన్య పౌరుని కలిసినట్టుగా ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు చెబుతున్నారని, ఇది ప్రజా పాలనకు నిదర్శనమన్నారు. ప్రజా పాలన అంటే ఎలా ఉండాలో నెల రోజుల్లోనే చేసి చూపించామన్నారు.

read also : బుద్ధిబలం ప్రాణబలం ప్రసాదించేది పుష్యమాసం.. జప తపాదులకు శ్రేష్టం..

ప్రజా పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మధుసూధన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే రెండింటిని నెరవేర్చమని, 100 రోజుల్లో మిగతా గ్యారెంటీలు నెరవేర్చి ఇచ్చిన మాట నిలుపుకుంటామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నియంతృత్వ పోకడలు, ఆంక్షలు ఉండేవని.. ప్రజలు భయంతో బ్రతికారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరసన చేస్తే.. అక్రమ కేసులు పెట్టి.. ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా బతికే రోజులు వొచ్చాయని అన్నారు.

గత పదేళ్ల పాలన అంతా నిరంకుశంగా, నిర్బంధాలతో సాగిందని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరకుశం రాజ్యమేలిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కి అధికారం పోయిన అహంకారం తగ్గలేదని ప్రజల తీర్పును గౌరవించడం లేదన్నారు. కారు సర్వీసింగ్ కి పోలేదని శాశ్వతంగా ప్రజలే కారును షెడ్డు కు పంపారని పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ ఉనికిలో లేకుండా పోతుందని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఎన్నో అక్రమాలు జరిగాయని వాటిపై రివ్యూ లు జరుగుతున్నాయని, దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

Hospital

read also : అధికారులపై మంత్రి ఆగ్రహం.. కొనుగోళ్లలో జాప్యం చేయకూడదని ఆర్డర్స్..

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒక ప్రణాళిక లేకుండా కాల్వలు తవ్వకుండా, కాల్వలకు భూసేకరణ చేయకుండా నిర్మించారని మధుసూధన్ రెడ్డి అన్నారు. ఇప్పటికి 30% పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. కాలువల కోసం ఒక ఎకరా కూడా భూ సేకరణ బిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదని ఎమ్మెల్యే జియంఆర్ అన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే పేరుతో కరివేన ప్రాజెక్ట్ లో స్వయంగా కాంట్రాక్టులు చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఎన్నో అవకతవకలకు పాల్పడ్డాడని, వాటిపై విచారణ జరిపిస్తామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో చుట్టుపక్కల చెరువులలో కొల్లగొట్టిన నల్లమట్టిపై ఆయా గ్రామాల ప్రజలు, ముఖ్యంగా వేముల గ్రామ ప్రజలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసారని, వారి ఫిర్యాదు పై విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

read also : శ్రీనగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు..

కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, తప్పు జరుగుతే చూస్తూ ఊరుకోదని వారిపై చట్టారీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా రేపటి నుండి మణిపూర్ నుంచి ముంబై వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నారని వెల్లడించారు. ఈ యాత్ర 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 100 లోక్‌సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ 6700 కిలోమీటర్లు యాత్ర పూర్తయి మార్చి 20న ముంబైలో ముగుస్తుందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం, అన్యాయం చేసిందని ఆరోపించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ నిరుద్యోగులకు అన్యాయం చేశారన్నారు.

read also : సంక్రాంతి ముగ్గుల్లో సత్తా చాటిన సత్తుపల్లి యువకులు..

”పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరిచారని. పాలు సహా అన్నింటిపైనా జీఎస్టీ వసూలు చేస్తున్నరని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, ఆదివాసీలు, దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రధానమంత్రి స్పందించడం లేదన్నారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన మహిళా రెజ్లర్ల పై బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్పై లైంగిక వేధింపుల ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించినా చర్యలు తీసుకోలేదన్నారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అన్ని వర్గాల వారికీ మోడీ అన్యాయం చేశారని. అందరికీ న్యాయం జరగాలన్న లక్ష్యంతో రాహుల్ న్యాయ్ యాత్ర చేస్తున్నారని ఈ యాత్ర ప్రజల పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని, ఈ యాత్ర పెద్ద ఎత్తున విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి వినోద్ మహబూబ్ నగర్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ దేవరకద్ర నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండ జగదీశ్వర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.