Read News in Telugu Language
adsdaksha

భారత్ రికార్డు… 97 కోట్లకు చేరిన ఓటర్లు.. 2 కోట్ల మంది యూత్ కొత్తగా నమోదు ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 10

భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న దేశంగా ఇండియా నిలిచింది. మన దేశంలో 97 కోట్ల మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఎన్నికల సంఘం శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం భారత్‌లో 96.88 కోట్ల మంది ప్రజలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నట్టు తెలిపింది. ఇదిలావుంటే.. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే ఓటరు నమోదు 6 శాతం పెరిగిందని, ఓటర్ల జాబితాలో కొత్తగా 2 కోట్ల మంది యువ ఓటర్లు చేరారని పేర్కొంది.

Hospital

read also : neet ug 2024 : మే 5న నీట్ ఎగ్జామ్ ..

2023 సంవత్సరంలో 940 గా ఉన్న లింగ నిష్పత్తి 2024లో 948 కి పెరిగిందని వెల్లడించింది. పుణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఓటర్ల జాబితాపై కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రాజకీయ పార్టీల భాగస్వామ్యం, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పలు విషయాలను ఈసీ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.