Read News in Telugu Language
adsdaksha

నేటి నుండే భారత్ రైస్.. కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.29లకే కిలో బియ్యం..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ : ఫిబ్రవరి 6

పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు కోసం కేంద్ర ప్రభుత్వం ‘భారత్ రైస్’ అనే సరికొత్త స్కీమ్ తీసుకొస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ‘భారత్ రైస్’ విక్రయాలకు శ్రీకారం చుట్టనున్నారు. కేజీ భారత్ రైస్ కేవలం 29 రూపాయలకే అందించనున్నారు. చౌకధరకే లభించే ఈ నాణ్యమైన బియ్యం సేల్స్ ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్ వేదికగా నేడు ప్రారంభించనున్నారు.

Read also: విశాఖ టెస్టులో భారత్ విక్టరీ.. ఇంగ్లాండ్ పై 106 పరుగుల తేడాతో గెలుపు..

భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) నుంచి సేకరించిన 5లక్షల టన్నుల బియ్యాన్ని భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్), భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్సీసీఎఫ్), కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల ద్వారా తొలి విడతలో విక్రయించనున్నారు. భారత్ రైస్ 5కిలోలు, 10కిలోల బ్యాగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే భారత్ గోధుమపిండి, పప్పుధాన్యాలను భారత్ ఆటా, భారత్ దాల్ పేరిట కిలో రూ.27.50, రూ.60 చొప్పున కేంద్రం విక్రయిస్తోంది. వీటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. భారత్ రైస్ ను కూడా అదేతరహాలో ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

Hospital

Read also: తెలంగాణ నుంచి పోటీ చేయండి.. సోనియా గాంధీనీ కోరిన సీఎం రేవంత్ రెడ్డి..

భారత్ రైస్ ను మొబైల్ వ్యాన్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మూడు కేంద్ర కోఆపరేటివ్ ఏజెన్సీలకు నేరుగా వెళ్లి కూడా తీసుకోవచ్చు. త్వరలోనే ఈ- కామర్స్ ప్లాట్ ఫామ్స్ సహా ఇతర రిటైల్ చైన్స్లోనూ అందుబాటులోకి తీసుకొస్తాం. దేశంలో బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపడుతోంది. రోజు వారీ స్టాక్ వివరాలను ట్రేడర్లు, వోల్ సేలర్స్, రిటైల్స్, బిగ్ చైన్ రిటైల్స్, ప్రాసెసర్స్, మిల్లర్లు వెల్లడించాలని ఇప్పటికే ఆదేశించాం అని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రెటరీ సంజీవ్ చోప్రా వెల్లడించారు. బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. బియ్యం ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.