Read News in Telugu Language
adsdaksha

భూ బాధితులకు న్యాయం చేయడమే గద్దరన్నకు నిజమైన నివాళి : డిప్యూటీ సీఎం భట్టి

దక్ష న్యూస్, హైదరాబాద్ : జనవరి 26

జీవితమే భూ పోరాటం అని భావించిన గద్దర్ అన్నకు నిజమైన నివాళి అంటే.. భూ బాధితులకు న్యాయం చేయడమే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( bhatti vikramarka ) అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చందనవెల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 190 భూసేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తాం

అన్నారు. ఎంజాయ్ మెంట్ సర్వే పేరిట భూమి లేని వారి పేర్లను భూ సేకరణలో చేర్చి నిజమైన రైతులకు పరిహారం ఇవ్వలేదని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తూ ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో భూ భాధితులు నా దృష్టికి ఈ విషయం తీసుకువచ్చారన్నారు.

read also : వందేభారత్ ఆడియో ఆవిష్కరించిన వద్దిరాజు రవిచంద్ర..

Hospital

భూసేకరణ అవకతవకలతో జరిగిందని, భూసేకరణ పరిహారం అర్హులకు రాకుండా బోగస్ లబ్ధిదారులు తీసుకున్నారని దీనిపై విచారణ చేయాలని భూ బాధితులు కోరారని భట్టి తెలిపారు. భూ భాధితుల విజ్ఞప్తి మేరకు నిజమైన లబ్ధిదారులకు పరిహారం ఇప్పించేందుకు సమగ్ర విచారణ చేయిస్తానని భట్టి హామీ ఇచ్చారు.

నిజమైన లబ్ధిదారులకు రావలసిన పరిహారం డబ్బులను కొల్లగొట్టిన దళారులపై విచారణ చేయించి వాస్తవాలు బయటికి తీసుకు వస్తామన్నారు. భూ బాధితులకు స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటానని భట్టి పేర్కొన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పరిశ్రమలు అన్యాయం చేస్తే ఊరుకోమని, ప్రజా ప్రభుత్వంలో ప్రజలతో మాట్లాడకుంటే పాలన జరగదన్నారు.

read also : పారిశ్రామికాభివృద్ధి కోసం సమగ్ర మెగా మాస్టర్ ప్లాన్..

ప్రజలు లేని పాలన అది పాలనే కాదని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. ప్రజలు చెప్పిన సమస్యలు విని వాటికి పరిష్కారం చేస్తేనే అది ప్రజా ప్రభుత్వం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు వారి పర్యటనల సందర్భంగా తప్పనిసరిగా ప్రజలను కలుస్తారని భట్టి తెలిపారు. మంత్రుల పర్యటన సందర్భంగా గత ప్రభుత్వాల మాదిరిగా ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలనలో ప్రజలకు నిర్బంధాలు ఉండవు రాష్ట్ర ప్రజలు స్వాతంత్రాన్ని స్వేచ్ఛగా అనుభవించడమే మా ప్రభుత్వ పాలన లక్ష్యం అని తెలిపారు. భూ పోరాటమే తన జీవితమని భావించిన గద్దర్ అన్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో నాతో పాటు చందనవెల్లికి రావడం జరిగిందని చందన వెళ్లి భూ బాధితుల సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు గద్దర్ అన్న తప్పనిసరిగా గుర్తుకు వస్తారన్నారు. జీవితమే భూ పోరాటం అని భావించిన గద్దర్ అన్నకు నిజమైన నివాళి అంటే.. భూ బాధితులకు న్యాయం చేయడమే అని భట్టి పేరొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.