Read News in Telugu Language
adsdaksha

ఆరోగ్యశ్రీలో అదనంగా 65 కొత్త చికిత్సలు .. 1375 పాత చికిత్స విధానాలకు నగదు ప్యాకేజీ పెంపు..

దక్ష న్యూస్, హైదరాబాద్: జూన్ 8

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులకు చికిత్స, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ ( arogya sri )  పథకంలోని చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా శనివారం ఈ నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ( bhatti vikramarka )  జారీ చేశారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ పధకం కింద కొత్త చికిత్సా విధానాల కొరకు ప్రస్తుతం ఉన్న పథకాల ఆర్థిక సవరణ కొరకు మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయం లో సమావేశము నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము 2007 లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యము అందించేందుకు ఆరోగ్యశ్రీ పధకం ప్రెవేశపెట్టిందని అన్నారు.

Read also: మొదట విడతలో ఇళ్లు…!రెండో విడతలో ఇళ్ల స్థలాలు ఇస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

Hospital

ఈ పథకం కింద 2.84 కోట్ల లబ్ధిదారులు ఉన్నాట్లు భట్టి పేర్కొన్నారు. వీరికి రూ. 10 లక్షల వరకు ఆర్ధిక సహాయం ఈ పధకం ద్వారా అందుతుందన్నారు. రాష్ట్రం లో ఈ సదుపాయం 1402 ఆసుపత్రుల ద్వారా అందించబడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
ప్రస్తుతం ఈ పధకం లో 1672 చికిత్సా విధానాలు అందుబాటులో వున్నాయన్నారు. ఇందులో 1375 విధానాలకు ప్యాకేజీ ధరలు పెంచాలని వైద్య నిపుణుల సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు.

Read also: ప్రశ్నకు పట్టాభిషేకం.. జర్నలిజానికి జన నీరాజనం.. ఎమ్మెల్సీగా కలం యోధుడు తీన్మార్ మల్లన్న..

ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీలో అమలులో లేని యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుపూస కు సంబంధించిన 65 అధునాతన చికిత్స విధానాలను ఇకనుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించామని భట్టి తెలిపారు. వీటికి తోడు
ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ లో ఉన్న 98 చికిత్సా విధానాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ లో చేర్చడం వల్ల దాదాపు 189.83 కోట్ల ఖర్చు ప్రభుత్వం పై పడనుందని తెలిపారు.

అంతే కాక, 65 కొత్త చికిత్సా విధానాలు అంగీకరించడం వల్ల ప్రభుత్వo రూ. 158.20 కోట్లు ఖర్చు చేయనుందన్నారు. పై సవరణల వల్ల, కొత్త చికిత్సా విధానాలు చేర్చడం కోసం, ప్రభుత్వం అదనంగా రూ. 497.29 కోట్లు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంజూరు చేశారు.

Leave A Reply

Your email address will not be published.