Read News in Telugu Language
adsdaksha

మహేశ్వరంలో భట్టి .. మధుయాష్కి గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి కృషి..

దక్షన్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 7

రానున్న ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ ( congress ) పార్టీ విజయం సాధిస్తుందని సీఎల్పీ ( clp ) నేత భట్టి విక్రమార్క ( bhatti vikramarka ) అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( rahul gandhi ) చేపట్టిన భారత్ జోడో యాత్ర ( bharath jodo yatra ) కు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మహేశ్వరం నియోజకవర్గం, కొత్తపేటలో జరిగిన కార్యక్రమానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్య అతిథి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచమే ఆశ్చర్యం పోయే విధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు.

read also : 9న జాతీయ లోక్‌ అదాలత్‌ .. పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్..

భారత్ జోడో యాత్ర ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాహుల్ ఆలోచనలను భారత్ జోడో సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నదని భట్టి తెలిపారు. భారతదేశం అనేక కులాలు, మతాలు, ప్రాంతాలకు నిలయం అని భట్టి అన్నారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషి భారతీయుడే. మనందరం ఉమ్మడి కుటుంబం గా జాతి నిర్మాణం జరిగి దేశం అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని పేర్కొన్నారు.

Hospital

read also : భాజపా, భారాస సఖ్యత వార్తల్లో నిజం లేదు..మీట్ అండ్ గ్రీట్ ర్యాలీలో బండి సంజయ్..

కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారం కోసం ఓట్లు పొందడానికి మతం పేరిట భారతదేశంలో చిచ్చు పెట్టి ఓట్లు పొంది అధికారం చెలాయించాలని చూస్తోందని, దాని దురాలోచన దేశ విచ్చిన్నానికి దారితీస్తున్నదన్నారు. భారతజాతి ఐక్యంగా ఉండటం బిజెపికి ఇష్టం లేదని, దేశ సంపద, వనరులు ప్రజలందరికీ సమానంగా పంచబడాలన్నారు. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బహుళ జాతి కంపెనీలకు దేశ సంపద వనరులను ధారాదత్తం చేస్తున్నదని భట్టి విక్రమార్క ఆరోపించారు.

read also : బిఆర్ఎస్ అహంకారానికి కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్ ..

దేశ భవిష్యత్తు మొత్తం కాంగ్రెస్ పార్టీదే అన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఉన్నత చదువులు చదువుకొని విదేశాల్లో ఉద్యోగం చేస్తూ దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టాలని రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు కోసం పోరాడి రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కి
గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.