Read News in Telugu Language
adsdaksha

తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించాం: భట్టి

దక్ష న్యూస్, హైదరాబాద్: డిసెంబర్ 26

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం భేటీ అయిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీతో మాట్లాడిన విషయాలను మీడియాకు భట్టి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి ప్రధాని నరేంద్రమోదీని కలవడం తమకు సంతోషంగా ఉందన్నారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా విభజన చట్టంలో తెలంగాణ కోసం ఇచ్చిన హామీలను ప్రధాని దృష్టికి తీసుకొచ్చామని భట్టి తెలిపారు. పెండింగులో ఉన్న ప్రాజెక్టులకు నిధుల పట్ల ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని భట్టి చెప్పారు.

తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని ప్రధాని మోదీని కోరినట్లు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. రాష్ర్ట విభజన సమయంలో ఇచ్చిన అనేక అంశాలను మోదీ దృష్టికి తీసుకెల్లినట్లు తెలిపారు.
రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని ముఖ్యమైనవి ప్రాజెక్టులను, నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురాలేదని, వాటిని త్వరగా తెలంగాణ రాష్ట్రానికి అందించాలని విజ్ఞప్తి చేశామన్నారు.

బయ్యారంలో స్టీల్ ప్లాంట్, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, ఐటీఐఆర్ ప్రాజెక్టును వెంటనే మంజూరు చేయాలని కోరామన్నారు.

విభజన హామీలో పొందుపర్చిన విధంగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశాం అన్నారు.

Hospital

ఒక ఐఐఎం ప్రాజెక్టును హైదరాబాద్ కు మంజూరు చేయాలని, రాష్ట్రానికి ఒక సైనిక్ స్కూలును ఏర్పాటు చేయాలని అడిగినట్లు తెలిపారు.

నేషనల్ హైవే ఆథారిటీకి సంబంధించి.. 14 ప్రతిపాదనలను పెండింగులో ఉన్నాయని, వాటిని పరిగణలోకి తీసుకుని వెంటనే ఆమోదం తెలపాలని కోరినట్లు చెప్పారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నిధులు కొన్నేండ్లుగా పెండింగులో ఉన్నాయని, వాటిని వెంటనే రిలీజ్ చేయాలని కోరామన్నారు.

Read also: రేపు రాత్రికే శబరిమల ఆలయం మూసివేత..

మరీ ముఖ్యంగా 2020-21 నుంచి 23-24 వరకు రూ. 1,800 కోట్లు పెండింగులో ఉన్నాయని, వాటిని విడుదల చేయాల్సిందిగా అడిగామన్నారు. మిగతా పెండింగులో ఉన్న రూ.450 కోట్ల నిధులు విడుదల చేయాలని అడిగాం అన్నారు.

నీటి పారుదల, విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో కేంద్ర సహకారాన్ని కోరినట్లు తెలిపారు. గవర్నమెంటు ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన 2 వేల 250 కోట్ల నిధులను సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయాలని గుర్తు చేశామన్నారు.
అందుకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని భట్టి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.