Read News in Telugu Language
adsdaksha

ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తాం ..

దక్ష న్యూస్, ఖమ్మం : జనవరి 16

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తాం..

– ఎస్ టి ఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో అన్ని రకాల చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ( bhatti vikramarka ) అన్నారు.

ఎస్ టి ఎఫ్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ తెలంగాణ 2024 సంవత్సరం క్యాలెండర్ ను భట్టి ప్రజాభవన్లో ఉద్యోగులు ఉపాధ్యాయుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యావ్యవస్థ ప్రక్షాలనకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలిపారు.

Hospital

read also : డాక్టర్ మట్టా దయానంద్ ని కలిసిన తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు ..

ఎస్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ సైదులు, రాష్ట్ర అధ్యక్షులు
యూ. పోచయ్య, ఉపాధ్యాయులు, ఉద్యోగులు భట్టి విక్రమార్కను సత్కరించి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు.
అనంతరం ఎస్ టి ఎఫ్ నాయకులు మాట్లాడుతూ నూతనంగా కొలువు తీరిన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం విద్య బలోపేతానికి కృషి చేస్తుందని ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టే చర్యలకు ఎస్ టి ఎఫ్ పక్షాన సంపూర్ణంగా సహకరిస్తామని తెలియజేశారు.

read also : తల్లాడ జిల్లా పరిషత్ పాఠశాలలో అపూర్వ సమ్మేళనం..

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సిపిఎస్ రద్దు 317 జీవో బాధితుల సమస్యల పరిష్కారం, ట్రెజరీల్లో పేరుకుపోయిన ఉద్యోగుల పెండింగ్ బిల్లులు సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్ డి ఏ లను విడుదల చేయాలని, అశాస్త్రీయంగా పాఠశాలల్లో అమలవుతున్న ఉన్నతి ఎఫ్ ఎల్ ఎన్ విద్యా కార్యక్రమాల్ని ఉపాధ్యాయులతో సమీక్షించి ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఇబ్బందిగా పరిణమించిన కార్యక్రమాలపై పున సమీక్ష నిర్వహించాలని కోరుతూ బట్టి విక్రమార్క కి వినతిపత్రం అందించారు.

 

 

Leave A Reply

Your email address will not be published.