Read News in Telugu Language
adsdaksha

ఇందిరా సాగర్ ప్రాజెక్టు రీ డిజైన్ వల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డారు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : జనవరి 19

కొట్లాడి కోరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ళ కోసం అని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇరిగేషన్ మంత్రి ఎన్ ఉత్తం కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగు నీటి ప్రాజెక్టులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశం అనంతరం రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ,

తెలంగాణ రాష్ట్రం 2014 లో ఏర్పడిన నాటికి కేవలం 1552 కోట్ల రూపాయలతో దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే నాలుగు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి ఉండేవని భట్టి అభిప్రాయ పడ్డారు. 1552 వేల కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి 23 వేల కోట్లకు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి పది సంవత్సరాలుగా ఒక ఎకరానికి కూడా గత ప్రభుత్వం గోదావరి నీళ్లను అందించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి 1681 కోట్లు మంజూరు చేసి 889 కోట్ల రూపాయల పని చేశారని భట్టి తెలిపారు.

read also : వైద్యోనారాయణ హరి.. అది దేహమైనా.. సమాజమైనా..

Hospital

ఇందిరా సాగర్ ప్రాజెక్టు కు 1824 కోట్ల రూపాయలు మంజూరు చేసి 1064 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ రెండు ప్రాజెక్టులకు 1552 కోట్ల రూపాయలను తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడాదికి 500 కోట్ల రూపాయల చొప్పున నిధులను కేటాయించిన మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులు పూర్తయి 3 లక్షల 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందేవన్నారు. రిడిజైన్ చేసి…సీతారామ అని పేరు పెట్టి 18, 500 కోట్ల రూపాయలకు గత ప్రభుత్వం అంచనాలు పెంచారని తెలిపారు. సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ బ్యారేజ్ పేరిట 4481 కోట్ల రూపాయలు కేటాయించినట్లు భట్టి పేర్కొన్నారు.

1552 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్ట్ ను 23 వేల కోట్ల రూపాయలకు పెంచి ఇప్పటికే 8వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేక పోవడం శోచనీయమని భట్టి విమర్శించారు. ప్రాజెక్టు రీ డిజైన్ పేరిట గత ప్రభుత్వం ఆర్థిక దోపిడీకి పాల్పడిందన్నారు. ఇంతటి దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రజలు సహకరించాలని డిప్యూటీ సీఎం కోరారు.

read also : తెలంగాణలో టాటా గ్రూప్ మరో రూ.1500 కోట్ల పెట్టుబడులు ..

గత ప్రభుత్వం కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతా రామ ప్రాజెక్టు పేరిట చేసిన ఆర్థిక దోపిడీ చూసి కడుపు తరుక్కుపోతోందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరిట గత ప్రభుత్వం దోపిడీ చేసిన ఈ సొమ్ము రాష్ట్ర ప్రజల పన్నుల ద్వారా వచ్చిందే అన్నారు. ఈ సంపద ప్రజలకు ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలన్నారు. గోదావరి శబరి నది కలిసే ప్రాంతం నుంచి ఇందిర సాగర్ ప్రాజెక్టును డిజైన్ చేయగా గత ప్రభుత్వం చేసిన రీ డిజైన్ వల్ల ఈ నది నుంచి 365 రోజుల పాటు వచ్చే నీళ్లను తెలంగాణ ప్రజలు కోల్పోయారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.