Read News in Telugu Language
adsdaksha

తెలంగాణ ప్రజలకు దశాబ్ది వేడుకల శుభాకాంక్షలు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..

దక్ష న్యూస్, ఖమ్మం : జూన్ 1

అమరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజా పాలన ..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ( bhatti vikramarka mallu ) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ( telangana ) ప్రజల ఆకాంక్షలు, ఆలోచనల మేరకు ఆనాడు యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ ( sonia gandhi ) ధైర్యంగా తెలంగాణ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చారన్నారు. ప్రజల దశాబ్దాల కోరికను నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియాగాంధీకి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తొలి, మలిదశలో సుదీర్ఘకాలంగా సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు.

Hospital

read also : పాలేరు నా సొంత ఇల్లు.. మూడేళ్ళలోనే అర్హులందరికీ సంక్షేమ పథకాలు..

ఏ ఆశయాలు, ఆకాంక్షల కోసం ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు పాటుపడ్డారో అవి గత పది సంవత్సరాలుగా ఆచరణకు నోచుకోలేదన్నారు. నాటి పాలకుల నియంత పోకడలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన మొదలయ్యాక రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారన్నారు. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ఏకైక ఎజెండాగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు. గత పాలకుల విధ్వంసం నుంచి వికాసం, వెలుగుల వైపు ఈ రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు. ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్ ఇకనుంచి కేవలం తెలంగాణకే రాజధానిగా కొనసాగుతుందన్నారు.

read also : 3న దొడ్డి కొమురయ్య చిత్ర నిర్మాణ కమిటీ ప్రకటన : భద్రు నాయక్..

Leave A Reply

Your email address will not be published.