Read News in Telugu Language
adsdaksha

నేటి విద్యార్థుల భవిష్యత్తే రేపటి రాష్ట్ర భవిష్యత్తు .. విద్యార్థుల మధ్య డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు..

దక్ష న్యూస్, హైదరాబాద్: జూన్ 15

విద్యార్థుల మధ్యన జన్మదిన వేడుకలు చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా అని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ( bhatti vikramarka ) అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ప్రతిభ కేంద్రం బాలికల పాఠశాలలోని విద్యార్థులతో కలిసి భట్టి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ పాఠశాలలో ఉన్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడం కోసం ఈరోజు మీ మధ్యకు రావడం జరిగిందన్నారు. పేద సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. నేటి విద్యార్థుల భవిష్యత్తు రేపటి రాష్ట్ర భవిష్యత్తు అని అందుకోసం రాష్ట్ర సంపదను విద్యకు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందన్నారు.

Read also: గ్రూప్ 2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్…

ప్రపంచం తో పోటీపడే విధంగా అద్భుతమైన మానవ వనరులుగా మిమ్మల్ని తీర్చిదిద్దడమే ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని భట్టి విద్యార్దులను ఉద్దేశించి పేర్కొన్నారు. మీరు అభివృద్ధి చెందడమే ఈ రాష్ట్ర అభివృద్ధి అని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలో భాగంగా ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం అని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. బడ్జెట్లో నిధులు కేటాయించామని ఇంటర్నేషనల్ స్కూల్స్కుకి దీటుగా ప్రతి మండలంలో 20 నుంచి 25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.

Read also: రెవెన్యూ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు : రెవెన్యూ మంత్రి పొంగులేటి ..

గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు మంచినీటి సమస్య ఉందని నా దృష్టికి తీసుకువచ్చినందున మంజీరా నీళ్లను సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటామని భట్టి హామీ ఇచ్చారు.

Hospital

పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వడానికి కావలసిన పాఠ్యపుస్తకాలు, కోచింగ్ ఇచ్చేటువంటి నిష్ణాతులైన అధ్యాపకులను ఏర్పాటు చేస్తామన్నారు. మీ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు మీ పైన ఎన్నో ఆశలు కోరికలు పెట్టుకున్నారు వారి ఆశలను తీర్చడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులైన వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నదన్నారు. ఈ ప్రభుత్వం మీపై పెట్టుకున్న కలలను నిజం చేయడానికి ప్రతి నిమిషం ప్రతి క్షణం తపస్సు లాగా చదువుకొని మీ లక్ష్యాలను సాధించాలని విద్యార్దులను కోరారు.

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీలు చేస్తామని భట్టి తెలిపారు. విద్యా వైద్యం ప్రక్షాళన చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రజల సమస్యలను ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం గాలికి వదిలేయదని భట్టి తెలిపారు. సంక్షేమ విద్యకు బడ్జెట్ సమస్య కాదని ఎన్ని నిధులైన ఖర్చు చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉందన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, జన్మదినోత్సవం రోజున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలలో వేడుకలు జరుపుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు.

ఆడంబరాలకు వెళ్లే నాయకులకు భిన్నంగా సాదాసీదాగా విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం నిజంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంచి మనసుకు నిదర్శనం అన్నారు.

నిత్యం పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్న తపన కలిగిన నాయకుడు కాబట్టి ఈరోజు డిప్యూటీ సీఎం ఈ హాస్టల్కు రావడం జరిగిందని
ఘనంగా స్వాగతం పలికిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అనంతరం రెసిడెన్షియల్ పాఠశాలలోని డైనింగ్ హాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ భోజనం చేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం, సోషల్ వెల్ఫేర్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.