Read News in Telugu Language
adsdaksha

తెలంగాణ ప్రజలను స్కీంలు, స్కాంలతో దోచుకుంటుంన్నారు.. బండి సంజయ్..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 24

ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్ ( cm kcr ) ఖూనీ చేస్తున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ( bjp mp bandi sanjay ) ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక నవరాత్రుల సందర్భంగా కరీంనగర్ ( karemnagar ) నగరంలోని చైతన్యపురి, భాగ్యనగర్, మంకమ్మతోట, జ్యోతినగర్, రాంనగర్ లో గణనాథుల విగ్రహాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓట్ల కోసం గణేశ్ ఉత్సవాల పేరుతో దొంగ చాటుగా తాయిలాలిస్తారా అంటూ అధికార పార్టీ నాయకులపై మండిపడ్డారు. తెలంగాణ ( telangana ) లో కేసీఆర్ స్కీంలు, స్కాంలతో దోచుకుంటున్నారని, అంతే తప్ప ఆయన ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. కనీసం పోటీ పరీక్షలను సమర్థంగా నిర్వహించడం కూడా కేసీఆర్ కు చేతగావడం లేదని విమర్శించారు. పదేళ్లలో ఒక్క గ్రూప్ 1 పోస్టును కూడా భర్తీ చేయలేదని అన్నారు.

Hospital

read also : నాలుగో విడత వారాహి యాత్ర త్వరలో ప్రారంభం..

నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ చెలగాటమాడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. పరీక్షల రద్దుతో నష్టపోయిన ఒక్కో నిరుద్యోగికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు ఒక్కో నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కూడా అందించాలన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డును ఇంకెప్పుడు ప్రక్షాళన చేస్తారని నిలదీశారు. పాలమూరులో జరిగే బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు.

 

 

Leave A Reply

Your email address will not be published.