Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్‌, భారాసల వైఖరి టామ్‌ అండ్‌ జెర్రీ పోరాటం : బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఏప్రిల్ 3

గతంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( bjp mp laxman ) ఆరోపించారు. నాంపల్లి ( nampalli ) లోని బీజేపీ ( bjp ) రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. దీనికి సూత్రధారులను పూర్తిగా విచారించాలని, సీబీఐ ( cbi ) తో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Hospital

అసలు దోషులను వదలొద్దని బీజేపి ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ( cm revanthreddy ) కి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ ( congress ), బిఆర్ఎస్ ( brs )ల వైఖరి టామ్‌ అండ్‌ జెర్రీ పోరాటమని ఆయన అన్నారు. ఎన్నికలు రాగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంన్నారన్నారు.

పదేళ్లుగా భారాస ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రాలేదనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.