Read News in Telugu Language
adsdaksha

గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బోయిన ఝాన్సీరాణికి డాక్టరేట్ …

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 4

తెలంగాణ ( telangana ) సాంఘీక సంక్షేమ గురుకుల ఖమ్మం ( khammam ) మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్న బోయిన ఝాన్సీరాణి( boyina jhanserani )  స్టాటిస్టిక్స్ విభాగంలో పి హెచ్ డి ( phd ) పూర్తిచేసి “డాక్టరేట్” సాధించారు. ఈ సందర్భంగా గురుకుల డిగ్రీ కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ… ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి “సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫోర్ కాస్టింగ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్ త్రో లైనర్ అండ్ నాన్ లైనర్ టైమ్ సిరీస్” అన్న అంశంపైన చేసిన పరిశోధనకు ఉస్మానియా యూనివర్సిటీ స్టాటిస్టిక్స్ విభాగంలో ప్రొఫెసర్ ఎస్ఎ జ్యోతిరాణి ఆధ్వర్యంలో బోయిన ఝాన్సీరాణి డాక్టరేట్ పట్టా పొందారని తెలిపారు.

read also : జర్నలిస్ట్ లకు తోడుగా మేము సైతం.. దద్దరిల్లిన రౌండ్ టేబుట్ సమావేశం..

Hospital

ఝాన్సీరాణి కొత్తగూడెం పట్టణంలో బోయిన సత్యనారాయణ మాలతీ దంపతులకు జన్మించారని శ్రీలక్ష్మి తెలిపారు. పాఠశాల విద్యను సింగరేణి కాలరీస్ గర్ల్స్ హై స్కూల్లో, సింగరేణి కాలరీస్ మహిళా డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో అప్లైడ్ స్టాటిస్టిక్స్ విభాగంలో పీజీ పూర్తి చేశారన్నారు. డిగ్రీ కళాశాలలో స్టాటిస్టిక్స్ కాంట్రాక్ట్ లెక్చరర్ గా 2004 నుండి 2019 వరకు పనిచేసి, 2019లో తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల ఖమ్మం నందు ప్రభుత్వ స్టాటిస్టిక్స్ లెక్చరర్ గా, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా బాధ్యతలను నిర్వర్తించారని తెలిపారు.

read also : సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం :మణుగూరు సిఐ రమాకాంత్ ..

2022లో ఖమ్మం గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. స్టాటిస్టిక్స్ విభాగంలో యూనివర్సిటీ ర్యాంకులు సాధించడంలో ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి ఎంతోమంది విద్యార్థినులకు మార్గదర్శకులుగా నిలిచారన్నారు. డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే పట్టు విడువని విక్రమార్కునిలా ఉన్నత చదువులైన పీహెచ్డీపై దృష్టి సారించి డాక్టరేట్ పట్టా పొందడంపై కళాశాల అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. విద్యార్థినులు ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి మేడంను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు, సిబ్బంది, ప్రిన్సిపాల్ డాక్టర్ బోయిన ఝాన్సీరాణికి అభినందనలు తెలియజేసి, శాలువతో సత్కరించి ఘనంగా సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.