Read News in Telugu Language
adsdaksha

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ గెస్ట్‌హౌస్‌ నుంచే ఫోన్ ట్యాపింగ్ .. ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసుల దూకుడు..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఏప్రిల్ 8

జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలోని అతిథి గృహంలో సోమవారం ఉదయం సోదాలు జరిగాయి. ఆ గెస్ట్‌హౌస్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నవీన్‌రావు ( brs mlc naveenrao ) కు చెందినదని ప్రచారం జరిగింది. మరోవైపు ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కు ప్రణీత్ రావు బృందం దీన్ని అడ్డాగా మార్చిందని దర్యాప్తు బృందం భావిస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు బృందం ఈ గెస్ట్ హౌస్ ను ఉపయోగించింది. రేవంత్ ఇంటికి కూతవేటు దూరంలో ఉండడంతో ఇక్కడి నుంచి తమ పని సులువవుతుందని టీమ్ భావించింది. ఈ అతిథి గృహం నుంచి అడిషనల్ ఎస్పీ భుజంగరావు ట్యాపింగ్ ఆపరేషన్ నిర్వహించారు. నిందితులు వెల్లడించిన సమాచారం మేరకు ప్రస్తుతం పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Read also: బీఆర్‌ఎస్‌కు మరో భారీ షాక్‌ .. ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ లో చేరిక..

Hospital

ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ కు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కంటే ఈ గెస్ట్ హౌస్ బెటర్ అని ప్రణీత్ రావు టీమ్ భావించింది. ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ అంతా ఇక్కడే నిర్వహించినట్లు నిందితులు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో భుజంగరావు గెస్ట్ హౌస్‌లో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను ఇప్పటికే ధ్వంసం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Read also: బోణికొట్టిన ముంబయి.. 29 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపు..

ఈ కేసులో ఎమ్మెల్సీ నవీన్‌రావును కూడా రేపో,మాపో విచారణకు పిలిచి నవీన్‌రావుతో పాటు మరో ఎమ్మెల్సీకి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎమ్మెల్సీ నవీన్‌రావు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఆయన కేసీఆర్ వెంటే ఉన్నారు. గతంలో ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన నవీన్‌కు నిరాశే ఎదురైంది. కానీ కేసీఆర్ ఆయనను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేశారు.

Leave A Reply

Your email address will not be published.