Read News in Telugu Language
adsdaksha

తుమ్మల వైఖరి కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లు ఉంది : పగడాల నాగరాజు

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 24

మంత్రిపై చేసిన వ్యాఖ్యలకు ఒక రేంజ్ లో ఫైర్ అయిన బిఆర్ఎస్ నాయకులు..

మంజుల వీపు వాచిపోతుందంటూ వ్యాఖ్యలు..

మాజీ మంత్రి తుమ్మల ( tummala ) వైఖరి కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లు ఉందని బిఆర్ఎస్ ( brs ) ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ( pagadala nagaraju ) అన్నారు. తుమ్మలను చూస్తే జాలి కలుగుతోందని, పాలేరు ( paleru ) సీటు కోసం పట్టుబట్టిన తుమ్మలను ఖమ్మం ( khammam) లో వేసినా, నిజమైన కాంగ్రెస్ శ్రేణులెవ్వరూ తుమ్మలతో కలసి తిరగడంలేదన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వెంట ఉన్నవారు మాత్రమే ఇప్పుడు వెంట ఉన్నారని, నిజమైన కాంగ్రెస్ శ్రేణులు ఆయన వెంట తిరగరన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడడం తుమ్మలకు రాదని, ఇప్పుడు తుమ్మల పరిస్థితి చూస్తుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లు ఉందని ఎద్దేవా చేశారు.

Hospital

మాజీ మంత్రి తుమ్మల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖాసీం రజ్వీని తలపిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్ఎస్ నేతలు అన్నారు. మంగళవారం ఖమ్మం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల తెదేపా నుండి బిఆర్ఎస్ లో చేరిన నాయకుడు తాళ్ళూరి జీవన్ కుమార్ మాట్లాడారు. తెలంగాణ ( telangana ) లో అంగరంగ వైభవంగా మహిళలు బతుకమ్మ వేడుకలు జరుపుకుంటుంన్న పండుగల వేళ తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పువ్వాడను ఖాసీం రజ్వీతో పోల్చడం విడ్డూరంగా ఉందన్నారు. మైనార్టీ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్ మాట్లాడుతూ, పోలీస్ చెయ్యి కొరికి కేసుల పాలయిన మంజుల మంత్రిని మతిలేని మంత్రి అని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. మతి లేని మంత్రి అయితే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంటింటికి తిరిగి ఎలా పంపిణీ చేశారని ప్రశ్నించారు.

read also : విజయీభవ.. కేసీఆర్ పాట సీడి ఆవిష్కరణ..

ప్రభుత్వ పథకాలు ఇంటింటికి తిరిగి పంపిణీ చేసిన మంత్రి పువ్వాడను మతిలేని మంత్రి అని మరో సారి వ్యాఖ్యనిస్తే చూస్తూ ఊరుకోమని, నోరు అదుపులో పెట్టుకోకపోతే వీపు వాచిపోతుందన్నారు. బిఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచార కమిటీ కన్వీనర్ షకీనా మాట్లాడుతూ పువ్వాడపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తుమ్మల పువ్వాడకు క్షమాపణలు చెప్పాలన్నారు. మిక్కిలినేని మంజుల నోరు అదుపులో పెట్టుకోకపోతే మహిళలే బుద్దిచెపుతారన్నారు.

సమావేశంలో బిఆర్ఎస్కేవి రాష్ట్ర నాయకుడు పాల్వంచ కృష్ణ, జక్కుల లక్ష్మయ్య, గొల్లపూడి హరికృష్ణ, మహేష్, నరేష్, శంకర్రావు, గంటా భిమయ్య పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.