Read News in Telugu Language
adsdaksha

భద్రాచలానికి రూపాయి ఇవ్వలే… రాముడితో పంచాయితీ లేదు బీజేపీతోనే : మాజీ మంత్రి కేటీఆర్..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఏప్రిల్ 11

భద్రాచలానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఘట్‌కేసర్‌లో మల్కాజిగిరి బీఆర్‌ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ, కొందరు నేతలు వెళ్లిపోయినా పార్టీకి వచ్చే నష్టం లేదని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం ప్రజలు ఇచ్చిన బాధ్యత అని పేర్కొన్నారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. రైతులకు రుణమాఫీ కాలేదని విమర్శించారు.

Read also: డీజీ రాజీవ్ రతన్ అంత్యక్రియలు పూర్తి.. హాజరైన సీఎం రేవంత్, మంత్రులు..

రేవంత్‌ ముఖ్యమంత్రి మాటలు మాట్లాడడం లేదని కేటీఆర్‌ అన్నారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే కర్మ తమకు లేదని, వారు మీ పక్కనే ఉన్నారన్నారు. రైతు బంధు, దళిత బంధు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, బతుకమ్మ చీరలతోపాటు అన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి కచ్చితంగా బీజేపీలో చేరతారని జోస్యం చెప్పారు.

Read also: బీజేపీ కారిడార్లు నిర్మిస్తోంది : డీఎంకేపై ప్రధాని మోదీ విమర్శలు..

Hospital

పదేళ్లు దేశాన్ని పాలించిన ప్రధాని మోదీ తెలంగాణకు రూపాయి ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు. ప్రధాని తాపీ మేస్త్రీ అయితే సీఎం గుంపు మేస్త్రీ అని నినదించారు. ఇద్దరు కలిసి తెలంగాణాను నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. భాజపాకు రాష్ట్రంపై ప్రేమ ఉంటే.. భద్రాచలం ఆలయానికి ఎవరైనా పైసా ఇచ్చారా అని ప్రశ్నించారు. అయోధ్యలో ఉన్నది రాముడే, భద్రాచలంలో ఉన్నది కూడా రాముడే అని అన్నారు.

Read also: మంత్రి పొంగులేటి రంజాన్ శుభాకాంక్షలు..

శ్రీరాముడు అందరికీ చెందుతాడు.. ఆ రాముడితో మాకు పంచాయితీ లేదు.. పంచాయితీ అంతా బీజేపీతోనే. ఈ పదేళ్లలో ఏం చేశారని బీజేపీ వాళ్లను అడిగితే జైశ్రీరాం అంటున్నారు. రాముడు బీజేపీ పార్టీ వాడు కాదు.. అందరి మనిషి. రాముడి పేరుతో రాజకీయాలు చేసే బీజేపీని తన్ని తరిమి కొట్టాలని కేటీఆర్ పిలుపు నిచ్చారు. యాదాద్రిని రాజకీయంగా వాడుకోలేదు. దేవుడే దేవుడు.. ధర్మమే ధర్మం.. రాజకీయమే రాజకీయం. మనకోసం ఎవరు పనిచేస్తున్నరని ప్రజలకు వివరించాలి. నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల, మతోన్మాదానికి కారణమైన బీజేపీని తరిమికొట్టాలని అని కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Read also: శ్రీ క్రోధి కావాలి మహా బోధి.. డా…గిరిసింహారావ్..

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.