Read News in Telugu Language
adsdaksha

వచ్చే నెలలోనే మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవం..

దక్ష న్యూస్, ఖమ్మం : జనవరి 29

* రైతు వేదికలకు ఇక మహర్దశ..

రైతులను, ప్రాసెసర్ లను, రిటైలర్ లను ఏకతాటిపైకి తెచ్చి, వ్యవసాయ ఉత్పత్తిని మార్కెట్ కు అనుసంధానించే యంత్రాంగాన్ని అందించడమే లక్ష్యంగా మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు జరిగిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( tummala nageswararao ) అన్నారు. సోమవారం మంత్రి, సత్తుపల్లి ( sattupalli ) మండలం బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ ( buggapadu mega food park ) ను సందర్శించి, చేపట్టిన పనులు, కావాల్సిన సదుపాయాల గురించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రూ. 70 కోట్ల అంచనా వ్యయంతో 2016 లో బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారని, మౌళిక సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్, పరిపాలనా భవన నిర్మాణాలు పూర్తయి, యూనిట్ల ఏర్పాటుకు ప్రాధమిక వనరులు అన్ని సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Read also: పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీలు..

జీడిపప్పు, మామిడి ప్రాసెసర్లు వచ్చాయని, త్వరలోనే అన్ని పంటలకు, కూరగాయలకు ప్రాసెసింగ్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. పండే పంటలు సరైన స్టోరేజి లేక పొలాల్లోనే చెడిపోతున్నాయని, ఫుడ్ పార్క్ తెస్తే, ఇక్కడ స్టోరేజి చేసి, సంబందిత ఉత్పత్తులు తయారుచేస్తారని, దీంతో రైతులకు మేలు కలుగుతుందని మంత్రి తెలిపారు. ప్రతి పంట చేనులో వృధా కాకుండా కోల్డ్ స్టోరేజి లేకా ఫుడ్ ప్రాసెసర్ యూనిట్ కి వెళ్లేలా చూడాలని, దీంతో రైతు పండించిన పంటకు డిమాండ్ తో పాటు, నష్టం వాటిల్లకుండా ఉంటుందని ఆయన మంత్రి అన్నారు.

Hospital

ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయని, ఏ దేశంలో ఏ పంటకు డిమాండ్ వుంది, ఎక్కడైతే మార్కెట్ బాగుంటుంది తెలుసుకొని అక్కడకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అన్నారు. పంట పండించే రైతు కన్నీరు పెట్టకూడదనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ విషయమై ముఖ్యమంత్రి ఆలోచన చేసి, కొన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారని ఆయన తెలిపారు. మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లాలో గోద్రెజ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు, పామాయిల్ విత్తనం దిగుమతి చేసుకునే అవసరం లేకుండా ఇక్కడే తయారుచేసుకునే చర్యలు చేపట్టినట్లు తుమ్మల తెలిపారు.

Read also: బిల్డర్స్ సంపదకు సృష్టికర్తలు .. మిమ్మల్ని కాపాడి ప్రోత్సహించే బాధ్యత మాదే : డిప్యూటీ సీఎం భట్టి..

రైతులకు సరైన ధర, గిట్టుబాటు తో మేలు జరుగుతుందని తుమ్మల అభిప్రాయ పడ్డారు. వచ్చే నెలలో మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఫుడ్ పార్క్ లో విద్యుత్, ఇతర సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ పనులు త్వరలో పూర్తి కానున్నట్లు ఆయన తెలిపారు. రైతులు మేలు జరిగే సాంకేతికతను అలవర్చుకోవాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో ఉన్న 12500 రైతు వేదికల్లో స్క్రీనులు ఏర్పాటు చేసి, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులతో ఇంటరాక్ట్ అయ్యేలా కార్యక్రమాలు రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో రైతులు పాల్గొని, పంట దిగుబడి, మార్కెటింగ్ విషయమై సమాచారం, సలహాలు పొందవచ్చని, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని మంత్రి అన్నారు. ఇట్టి విషయమై రైతులకు అవగాహన కల్పించాలని, ఈ దిశగా విస్తృత ప్రచారం చేయాలని మంత్రి తెలిపారు.

Read also: నేటి యువతరం మెచ్చే బైక్ జావా 350 : తుమ్మల యుగంధర్

అడవులు ధ్వంసం అయ్యాయని, పర్యావరణం దెబ్బతిందని, ఈ దిశగా ఆలోచన చేయాలని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతని, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి అన్నారు.
కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, పరిశ్రమల శాఖ జోనల్ మేనేజర్ పవన్ కుమార్, జిల్లా పరిశ్రమల అధికారి అజయ్ కుమార్, కల్లూరు ఆర్డీవో అశోక్ చక్రవర్తి, ఏసీపీ రామానుజం, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.