Read News in Telugu Language
adsdaksha

నేడు ఖమ్మంలో సామాజిక న్యాయ సాధనలో మహిళల పాత్ర అంశంపై సదస్సు ..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 10

వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 11న శనివారం ఉదయం 10 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని హోటల్ శ్రీధర్ కాన్ఫరెన్స్ హాలులో ” సామాజిక న్యాయ సాధనలో మహిళల పాత్ర అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సమితి అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి ( bukya upendra bhayi ), గౌరవ అధ్యక్షురాలు ఎస్కే నజీమా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా సోషల్ జస్టిస్ జేఏసీ చైర్మన్ , ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ , జాతీయ మానవ హక్కులు , న్యాయ కమిషన్ సభ్యురాలు (ఎన్ హెచ్ ఆర్ జె సి) , జమాతే ఇస్లామీ హింద్ ( జే ఐ హెచ్ ) సభ్యురాలు డాక్టర్ ఆయేషా సుల్తానా , ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలు స్వాతి , రాష్ట్ర బీసీ నాయకురాలు కృష్ణ లత , బీసీ రచయిత్రి దాసోజు లలిత , ఐలమ్మ ఆశయ సాధన సమితి అధ్యక్షురాలు చిట్యాల శ్వేత హాజరవుతున్నారని పేర్కొన్నారు.

Hospital

Read also: కాంగ్రెస్ తోనే ముస్లిం మైనార్టీలు.. బిఆర్ఎస్ పట్ల సడలిన విశ్వాసం ..

మహిళ సాధికారత కోసం జరిగే ప్రయత్నంలో ఈ సామాజిక న్యాయ సాధనలో మహిళల పాత్ర ముఖ్యపాత్ర వహిస్తుందని ఉపేంద్ర బాయి , నజీమా ప్రకటించారు. మహిళలు ఈ సదస్సుకు అత్యధిక సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.