Read News in Telugu Language
adsdaksha

bumrah : తొలి ఇన్నింగ్స్ లో… 253కే ఇంగ్లాండ్ ఆలౌట్.. భారత బౌలర్ బుమ్రా సరికొత్త రికార్డు..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 3

విశాఖలో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 253 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ బుమ్రా విజృంభనతో అతి తక్కువ స్కోర్ కే చాప చుట్టేసింది. ఓపెనర్ క్రాలి 76 పరుగులు చేసిన టాప్ స్కోరర్ గా నిలువగా స్టోక్స్ 47 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా కుల్దీప్ యాదవ్ కు 3, అక్షర్ పటేల్ కు ఒక వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులకు ఆలౌటైంది. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 143 పరుగుల భారీ ఆధిక్యం వచ్చింది.

Read also: ఫాస్టాగ్ గడువు పెంపు.. ఈనెల 28వరకు ఈ-కేవైసీ చేసుకోవచ్చు..

హైదరాబాద్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన ఈ పేసర్ బుమ్రా.. తాజాగా వైజాగ్ లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. స్పిన్నర్లలకు అనూకూలించే భారత పిచ్ లపై బుమ్రా చెలరేగిన తీరు అత్యద్భుతం. పోప్, కెప్టెన్ బెన్ స్టోక్స్ ను స్టంప్స్ ఎగిరి పడేలా ఔవుట్ చేశాడు. తొలి రెండు వికెట్లు స్పిన్నర్ల ఖాతాలోకి వెళ్లగా నెక్ట్స్ 8 వికెట్లలలో 6 బుమ్రా తీయడం గమనార్హం. మధ్యాహ్న భోజనం విరామం తర్వాత రూట్ (5), పోప్(23) లను అవుట్ చేశాడు. ఆ తర్వాత మరింత స్పీడ్ పెంచి బెయిర్ స్టో(25), స్టోక్స్(47), అండర్సన్(6), హార్టీలి(21) లను పెవిలియన్ కు పంపాడు.

Hospital

Read also: అద్వానీకి భారతరత్న.. ప్రధాని మోడీ కీలక ప్రకటన..

నాలుగు వికెట్లు పడగొట్టిన తర్వాత బుమ్రా టెస్టు కెరీర్ లో 150 వికెట్లను తన అకౌంట్ లో వేసుకున్నాడు. అతి తక్కువ బంతుల్లో (6781) 150 వికెట్లు తీసుకున్న భారత బౌలర్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు బుమ్రా. స్వదేశంలో ఒక ఫాస్ట్ బౌలర్ 5 వికెట్లు పడగొట్టడం చాలా అరుదు. అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ నుంచి ప్రస్తుతం అశ్విన్, జడేజా వరకు విదేశీ బ్యాటర్లకు భారత స్పిన్నర్లు పీడకలలా మారారు.

Leave A Reply

Your email address will not be published.