Read News in Telugu Language
adsdaksha

29న మంత్రివర్గ సమావేశం..?

దక్ష న్యూస్, హైదరాబాద్ : సెప్టెంబర్ 27

మరో వారం పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్..

క్యాబినేట్ భేటీపై తెలంగాణలో సర్వత్రా ఆసక్తి..

పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..

Hospital

తెలంగాణ ( telangana ) రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార బిఆర్ఎస్ ( brs ) పార్టీ చివరి మంత్రి వర్గ సమావేశానికి ( cabinet meeting ) సిద్దమయింది. ఈనెల 29న నిర్వహించబోతున్న సమావేశంలో పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వేతన సవరణ కోసం కమిషన్ ను నియమించడంతో పాటు మధ్యంతర భృతి కూడా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ( cm kcr )  శాసనసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అవసరం అనుకుంటే అంతకు ముందే ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశమై చర్చించే అవకాశం కూడా ఉంది. అనాథ చిన్నారుల కోసం ప్రత్యేక విధానాన్ని కూడా ఈ కేబినేట్ సమావేశంలో ఆమోదించే అవకాశం కనిపిస్తోంది.

read also : తెలంగాణ గ్రామీణ పర్యాటకానికి కేంద్ర పర్యాటక శాఖ అవార్డులు..

ఇటీవల జిల్లాల పర్యటనల సందర్భంగా కేసీఆర్ పలు హామీలు ఇచ్చారు. వాటిలో కొన్నింటికి మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంది. మరికొన్ని నిర్ణయాల విషయంలో కూడా నేతల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ భేటీలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సహా ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల కోసం గత మంత్రివర్గ సమావేశంలో తీర్మానించి సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ తిరస్కరించారు. వారికి అర్హత లేదని, కేవలం సమ్మరీ మాత్రమే ఇచ్చారని, సమగ్ర వివరాలు లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో వేచిచూడాలి. మొత్తంగా ఎన్నికల ముంగిట ఈ చివరి క్యాబినేట్ భేటీపై తెలంగాణలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

 

 

Leave A Reply

Your email address will not be published.