Read News in Telugu Language
adsdaksha

CEC Bill: ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ : డిసెంబర్ 21

వివాదాస్పద ఈసీ బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. దీంతో చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును గురువారం పార్లమెంట్ ఆమోదించినట్లైంది..ఈ బిల్లును రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్లు చట్టంగా రూపొందుతుంది..భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లోని ముగ్గురు సభ్యుల నియామకానికి సంబంధించిన విధివిధానాలను ఏర్పాటు చేయడం ఈ బిల్లు లక్ష్యం. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ ఎన్నికల కమిషన్‌ను ఎన్నుకోవాలనే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ బిల్లు విబేధిస్తుంది..

Hospital

Read also: తెలంగాణ క్రీడాకారులకు అర్జున అవార్డులు..

ఎన్నికల సంఘాన్ని నియమించాల్సిన విధివిధానాలపై సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో ఓ తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ.. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుంది. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. పార్లమెంట్ కొత్త బిల్లును ఆమోదించే వరకు ఈ విధివిధానాలను అనుసరించాలని స్పష్టం చేసింది..

Leave A Reply

Your email address will not be published.