Read News in Telugu Language
adsdaksha

సెల్‌ఫోన్‌ పేలి నలుగురు చిన్నారులు మృతి.. యూపీలో విషాద ఘటన..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 24

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ ఇంట్లో సెల్ ఫోన్ పేలిన ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందగా, వారి తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా షార్ట్‌ సర్క్యూట్‌తో మొబైల్‌ పేలిపోయింది. ఇళ్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం కాలిపోయింది. ఈ ఘటన శనివారం (మార్చి 23) రాత్రి పల్లవపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జనతా కాలనీలో చోటుచేసుకుంది.

Read also: రాజకీయ సానుభూతి కోసమే కేజ్రీవాల్ అరెస్ట్ ను ఆహ్వానించారు.. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కీలక వ్యాఖ్యలు..

ముజఫర్‌నగర్‌కు చెందిన జానీ కుటుంబం జనతా కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. జానీ కూలీగా పనిచేస్తున్నాడు. శనివారం హోలీ పండుగ సందర్భంగా జానీ భార్య బబిత ఇంట్లో వంట చేస్తోంది. గదిలో జానీ కుమార్తెలు సారిక(10), నిహారిక(8), కుమారుడు గోలు(6), మరో కుమారుడు కలు(5) ఉన్నారు. గదిలో కరెంట్ బోర్డ్ మీద సెల్ ఛార్జింగ్ పెట్టాడు జానీ. ఛార్జర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫోమ్ పరుపు పై నిప్పు రవ్వలు పడి పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు.

Read also: వచ్చే హోలీ నాటికి అర్హులంతా కొత్త ఇందిరమ్మ ఇళ్లలో ఉంటారు..

Hospital

ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో జానీ దంపతులు పిల్లలను రక్షించేందుకు ప్రయత్నించారు. ఇరుగుపొరుగు వారు వచ్చి వారిని బయటకు తీశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. నలుగురు చిన్నారులు మృతి చెందగా.. జానీ, అతని భార్య బబిత తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read also: జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై కేసు.. బంజారాహిల్స్‌ పీఎస్ లో చింతా మాధవ్ ఫిర్యాదు..

షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం : SP

పల్లవపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జనతా కాలనీలో శనివారం సాయంత్రం 5 గంటలకు షార్క్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కుటుంబ సభ్యులు ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో కాలిపోయారు. నిందితులు జానీ, అతని భార్య బబిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. వారి నలుగురు పిల్లలు చనిపోయారు..” అని మీరాట్ ఎస్‌ఎస్పీ రోహిత్ సింగ్ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.