Read News in Telugu Language
adsdaksha

తెలంగాణలో ఎన్నికల నియమావళి అమలయ్యేలా చూడండి ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : అక్టోబర్ 19

ఓట్ల కోసం ప్రకటనలు చేసే పత్రికలు, టీవీల్లోనే క్రిమినల్ కేసుల గురించి చెప్పాలి..

గత అఫిడవిట్ లకు, ప్రస్తుత అఫిడవిట్లకు తేడా పరిశీలించాలి..

Hospital

ఈసీకి సుప్రీం న్యాయవాదుల వినతి..

ఓట్ల కోసం ప్రకటనలు చేసే పత్రికలు, టీవీల్లోనే క్రిమినల్ కేసులపై కూడా ప్రకటనలు ఇవ్వాలని, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఆస్తులు, కేసులను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘం ( central election commission ) కి సుప్రీం కోర్టు (supreme court ) న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ( telangana ) లో ఎన్నికల నిర్వహణపై ఈసీ ( ec ) కి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు తప్పకుండా ఎన్నికల నియమావళి అమలు చేసేలా చూడాలని కోరారు. 2018లో పోటీ చేసిన అభ్యర్థుల ఆదాయాలు ఐదేళ్లలో భారీగా పెరిగాయని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. గత అఫిడవిట్, ప్రస్తుతం సమర్పించే అఫిడవిట్లను పోల్చి చూడాలని అన్నారు. ఈ ఐదేళ్లలో ఆదాయం అక్రమంగా పెరిగిందా? లేక సరైన మార్గంలోనేనా అనే విషయాన్ని ఎన్నికలకు ముందే పరిశీలించాలని కోరారు.

ఎంతో మంది అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించడం లేదని, డబ్బు, మద్యం పంపిణీ చేయడం తెలంగాణలో బాగా పెరిగిందని సుప్రీం కోర్టు న్యాయవాదులు తమ పిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని అరికట్టి ఓటర్లను ప్రభావితం చేయకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కు ఉందన్నారు. ప్రస్తుత సమయంలో ఎన్నికల అధికారుల నిఘా చాలా కీలకం అని, ఓట్ల కోసం ప్రకటనలు చేసే పత్రికలు, టీవీల్లోనే క్రిమినల్ కేసులపై కూడా ప్రకటనలు ఇవ్వాలన్నారు. అభ్యర్థి ఆదాయ ధ్రువీకరణపై పూర్తిస్థాయి పరిశీలన చేయాలని, ఎలాంటి క్రిమినల్ కేసులు లేని అభ్యర్థులను సరైన విధానంలో నిర్ధారించాలన్నారు. ఎన్నికల్లో నేరస్థులు పోటీ చేయకుండా చూడాలని సూచించారు. అభ్యర్థుల అఫిడవిట్ల పరిశీలన నిక్కచ్చిగా ఉండాలని, గత ఎన్నికల సందర్భంగా జరిగిన అన్ని అంశాలను ఈ సారి ఎన్నికల్లో అనుభవ పాఠాలుగా చూడాలని అన్నారు. అభ్యర్థుల చట్టవిరుద్ధమైన చర్యలను ఎదుర్కోవాలని ఎన్నికల కమిషన్ ను కోరినట్టు సుప్రీం కోర్టు న్యాయవాది జగన్ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.