Read News in Telugu Language
adsdaksha

సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు కన్ను మూత..

సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్..

సీనియర్ జర్నలిస్టు ( journalist ) సీహెచ్‌వీఎం కృష్ణారావు ( ch.v.m. krishnarao) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ ( hyderabad ) లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పత్రికా రంగంలో కొనసాగిన ఆయన అనేక సంస్థల్లో పనిచేశారు. కృష్ణారావు మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ( cm kcr) సంతాపం ప్రకటించారు.

read also : మై ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ దాతృత్వం..

Hospital

అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా వుండేవని సీఎం తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని సీఎం కేసీఆర్ తెలిపారు.

read also : తెల్లం వ్యవహారం తేటతెల్లం..

Leave A Reply

Your email address will not be published.