Read News in Telugu Language
adsdaksha

ట్యాంక్ బండపై చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి ..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 10

– జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్..

తెలంగాణ ( telangana ) సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ(chakali ilamma )  (చిట్యాల ఐలమ్మ) వర్ధంతి సందర్భంగా ఆదివారం రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఖమ్మం ( khammam ) జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రికి
ఖమ్మం లకారం ట్యాంకు బండపై తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధురాలు, బహుజన కులాల కీర్తిని పతాక స్థాయికి చేర్చిన నిప్పు కనిక చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.

Hospital

read also : ప్రవాసుల సంఘర్షణలకు, అస్త్తిత్వవేదనకు అద్దం పట్టిన నిశాంత్‌ ఇంజమ్‌..

చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కొత్తగుంట్ల లక్ష్మి , రజక సంఘం నాయకులు కొండలరావు , జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి , మహాత్మ జ్యోతిబాపూలే ఐడియాలజీ సొసైటీ అధ్యక్షులు పి విజయకుమార్ , సీనియర్ బీసీ నాయకులు పోలీస్ వెంకన్న తో కలిసి వినతి పత్రాన్ని అందించారు. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనుకూలంగా స్పందిస్తూ ఈనెల 26న చిట్యాల ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ట్యాంక్ బండ్ పై విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యడానికి నా సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు.

read also : నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడరాదు.. దక్షిణ దిశ దీపంతో అరిష్టాలు..

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు , మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నలమాస సుగుణ , గౌడ సంఘం రాష్ట్ర నాయకులు మరీదు శీను , యువజన విభాగం సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు మరీదు ప్రసాదు , రజక సంఘం నాయకులు ముదిగొండ వెంకటప్పయ్య , జక్కుల రామారావు వివిధ కుల సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.