Read News in Telugu Language
adsdaksha

రైతు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలి…

అశ్వాపురం, అక్టోబర్ 01, దక్ష న్యూస్:

వరి ప్రతి క్వింటాకు 500 రూపాయల బోనస్..

డాక్టర్ చందా సంతోష్ కుమార్..

అశ్వాపురం ( aswapuram ) మండలంలోని మల్లెలమడుగు ( mallelamadugu ) ఎంపీటీసీ బేతం రామకృష్ణ ఆధ్వర్యంలో మల్లెల మడుగు గ్రామంలో కాంగ్రెస్ ( congress ) ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలపై ఆదివారం పినపాక నియోజకవర్గం టీపీసీసీ మెంబర్ డాక్టర్ చందా సంతోష్ కుమార్ ( chanda santhosh kumar ) ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు, కౌలు రైతులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ రావాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, మెరుగైన 9 గంటల కరెంటు, జలయజ్ఞం పేరిట అనేక ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు.

read also : 3 నుండి తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీ బాల్ టోర్నమెంట్..

Hospital

ఇప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది తప్ప రైతులకు ఎటువంటి న్యాయం జరపలేదని కాలేశ్వరం పేరు మీద వందల కోట్లు వారి సొంత ఖజానాలో వేసుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని కౌలు రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు మహిళలకు మహా లక్ష్మీ,
ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి పథకం, చేయూత, యువ వికాసం,
రైతు భరోసా, వంటి పథకాలు అమలు జరుగుతాయని తెలియజేశారు.

read also : సాగర్ సరసన లేక్ ఫ్రంట్ పార్క్.. ఆదివారం నుంచి అనుమతి..

ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ చంచల రాము, వీర రాఘవులు బీసీ సెల్ అధ్యక్షులు బచ్చు వెంకటరమణ ఎస్సీ సెల్ అధ్యక్షులు నరసింహారావు, అశ్వాపురం మండల యువజన కాంగ్రెస్ నాయకులు మహేష్, రోడ్డ నాగరాజు, సోమవరపు నవీన్, పోడుపుగంటి సైదులు,
బి బ్లాక్ అద్యక్షులు బెల్లంకొండ వాసుదేవరావు, బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు బషీరుద్దీన్ , నియోజకవర్గ ఎస్టీ సెల్ నాయకులు నూప సురేష్ , మణుగూరు మండల బీసీ సెల్ అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణ, మణుగూరు మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ లతీఫ్, బూర్గంపాడు మండలం నాయకులు షేక్ కాజా మియా, ఉండటి వెంకన్న, కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

read also : 3 వ విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ..

Leave A Reply

Your email address will not be published.