Read News in Telugu Language
adsdaksha

ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తారా .. చండీగఢ్ మేయర్ ఎన్నికలపై సుప్రీం ఆగ్రహం..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ: ఫిబ్రవరి 6

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కొన్ని బ్యాలెట్ పత్రాలను చెల్లకుండా చేయడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, దానిపై పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయించినా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని పేర్కొంటూ ఆప్ కౌన్సిలర్ ఒకరు దాఖలుచేసిన పిటిషన్ న్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బ్యాలెట్లను, మొత్తం వీడియోను భద్రపరచాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్టీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం ఆదేశించింది.

Read also: నేటి నుండే భారత్ రైస్.. కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.29లకే కిలో బియ్యం..

Hospital

మేయర్ ఎన్నికను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని పిటిషనర్ కోరారు. దీనిపై చండీగఢ్ నగరపాలక సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నిక జరిగిన తీరుపై వీడియోను వీక్షించి ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాలెట్ పత్రాలపై రిటర్నింగ్ అధికారి మార్పులు చేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని పేర్కొంది. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. జరిగినదానిపై మేం దిగ్భ్రాంతి చెందాం. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడాన్ని అనుమతించేదే లేదు. ఆధారాలన్నీ భద్రంగా ఉంచాలి. చండీగఢ్ నగరపాలక సంస్థ తదుపరి సమావేశాన్ని వాయిదా వేసుకోవాలి అని సీజేఐ ఆదేశించారు.

Read also: విశాఖ టెస్టులో భారత్ విక్టరీ.. ఇంగ్లాండ్ పై 106 పరుగుల తేడాతో గెలుపు..

జనవరి 30న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్-ఆప్ కూటమిపై బీజేపీ విజయం సాధించింది. బీజేపీ 16 ఓట్లు, ఈ కూటమి 12 ఓట్లు తెచ్చుకోగా ఎనిమిది ఓట్లు చెల్లకుండా చేయడంపై ఆ రోజే వివాదం రేగింది.

Leave A Reply

Your email address will not be published.