Read News in Telugu Language
adsdaksha

తెలంగాణలో… టీడీపీ ఒంటరి పోరు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : అక్టోబర్ 28

జైల్లో చంద్రబాబుతో రాష్ట్ర అధ్యక్షుడు కాసాని ములాఖత్ ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ( telugudesham ) పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ( kasani gnaneswar ) తెలిపారు. రాజమహేంద్రవరం ( rajamahendravaram ) సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ ( tdp ) అధినేత చంద్రబాబు నాయుడు ( chandrababu nayudu ) తో శనివారం కాసాని ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా కాసాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ గురించి చంద్రబాబుతో చర్చించినట్టు తెలిపారు. ఏపీ ( ap ) కంటే తెలంగాణ ( telangana ) లోనే టీడీపీ బాగుందని కాసాని స్పష్టం చేశారు.

Hospital

read also : కందాళతో కాదు.. మీరు రండి పాలేరు లో పోటీ చేయడానికి : కేసిఆర్ కి పొంగులేటి సవాల్

ఇపుడున్న అన్ని పార్టీల్లో కంటే టీడీపీ బెటర్ అని, నాయకుల్లో చంద్రబాబు బెస్ట్ లీడర్ అని ఆయన కొనియాడారు. తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని జ్ఞానేశ్వర్ తెలిపారు. తెలంగాణలో ఎన్ని సీట్లపై పోటీ చేయాలనేది ఆదివారం టీడీపీ జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు లోకేష్ తో చర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. సాధ్యమైనంత వరకు అన్ని సీట్లలో పోటీ చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేయడం లేదన్నారు. ఇతర పార్టీలోకి వెళుతున్నానే వార్తలను ఆయన ఖండించారు. అదంతా అవాస్తవమని అదీ మీడియా సృష్టి మాత్రమేనని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.