Read News in Telugu Language
adsdaksha

జయహో .. భారత్.. వెల్లువెత్తిన అభినందనలు..వాడ వాడలా సంబరాలు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఆగస్ట్ 24

ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనల వెల్లువ..

ఆనందోత్సాహాలతో పండగ చేసుకుంటుంన్న చిన్నారులు..

చందమామ రావే.. జాబిల్లి రావే అని చంద్రుడిని పిలవడమే తప్ప.. చంద్రుడిని చేరుకున్న మన టెక్నాలజీ గురించి ఇప్పటి వరకు గొప్పగా చెప్పుకున్న సందర్భం రానేలేదు. దాంతో చంద్రయాన్ – 3 ( chandrayan – 3 ) చంద్రుడి దక్షిణ దృవం ముద్దాడిన సందర్భంగా దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఊరు ఊరునా వాడ వాడలా విద్యా సంస్ధల్లో జాతి గర్వపడే సంరంభాన్ని సంబరంలా నిర్వహించుకుంటుంన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు పంపే శుభాభినందనల వెల్లువలో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఎవరి నోట విన్నా ఒకటే మాట చందమామను అందుకున్నాం. చంద్రుడి పై త్రివర్ణ పతాకం ఎగరేశాం. ప్రపంచ దేశాల్లో అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతం సాధించబోతున్నాం. ప్రైమరీ స్కూల్ నుండి విశ్వవిద్యాలయాల వరకు ప్రతీ భావి భారత పౌరుల్లో నూతనోత్సాహన్ని ఉత్తేజాన్ని నింపిన చంద్రయాన్ – 3 విజయాన్ని కీర్తిస్తూ శాల్యూట్ చేస్తున్నారు. సామాన్య జనానికి మన విజయం అవగతమయ్యేలా రోడ్లపై ర్యాలీలు నిర్వహించి త్రివర్ణపతాక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. చంద్రయాన్ – 3 గొప్పదనం దశదిశలా చాటేలా నినాదాలు చేస్తున్నారు.

Hospital

read also : హెచ్ఎండిఏ వెంచర్ ప్లాట్ల వేలంలో గజం ధర రూ. 1 లక్ష..

చంద్రయాన్ – 3 విజయవంతమయ్యి విక్రమ్ ల్యాండర్ సేఫ్ గా చంద్రుడి దక్షిణ దృవం పై దిగడం పట్ల బుధవారం సాయంత్రం దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు.. శుభాకాంక్షలు తెలిపిన విషయం విదితమే. వివిధ రాష్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు వివిధ మీడియాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు సైతం సోషల్ మీడియా వేదికగా తమ సంతోషం పంచుకుంటున్నారు. అయితే బుధవారం విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై పాదం మోపే సమయంలో విద్యార్ధులు పాఠశాల ముగిసి ఇళ్ళకు వెళ్ళడంతో వారు ఇళ్లల్లో ఆసక్తిగా టీవీల్లో వివిధ మాద్యమాల్లో చంద్రయాన్ వియజయాన్ని ఆస్వాదించి ఆనందంతో నృత్యాలు చేశారు. ఇప్పటికే పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు చంద్రయాన్ – 3 ప్రయాణ విశేషాల్ని తెలియజేస్తుండడంతో నిన్న సాయంత్రం ఇళ్ళకు వెళ్ళిన చిన్నారుల్లోను విక్రమ్ ల్యాండర్ గమనం పట్ల ఉత్కంఠ నెలకొంది. విక్రమ్ క్షేమంగా ల్యాండ్ అవడంతో గురువారం పాఠశాలల్లో నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి. కొన్ని పాఠశాలల్లో నిర్వాహకులు సభలు సైతం నిర్వహించి చంద్రయాన్ – 3 విజయాన్ని, గమన విశేషాల్ని విద్యార్ధులకు వివరించారు.

 

 

Leave A Reply

Your email address will not be published.