Read News in Telugu Language
adsdaksha

చేపమందు హరినాధ్ గౌడ్ ఇక లేరు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఆగస్ట్ 24

నివాళులర్పించిన రాష్ట్ర మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్..

మృగశిర కార్తె రోజు అస్తమా రోగులకు చాపమందు ( chepa mandu )  ఉచితంగా పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ ( battini harinadh gaud ) (85) ఇక లేరు. హైదరాబాదులోని కవాడి గూడ లోని ఆయన నివాసంలో గురువారం ఆకాల మరణం చెందారు. హరినాథ్ గౌడ్ పార్థివ దేహానికి మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి అత్మ శాంతించాలని భగవంతున్ని ప్రార్థించారు.

Hospital

read also : మంత్రి మల్లన్న ఎంపీ నామాలే నాకు ఆదర్శం..ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అస్తమా రోగులకు హరినాథ్ గౌడ్ అందించిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్బంగా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…
ఎన్నో ఏండ్ల నుండి మృగశిర కార్తె రోజున అస్తమా రోగులకు ప్రతీ సంవత్సరం హైదరాబాద్ లో బత్తిని కుటుంబ సభ్యులు కోట్లాది మంది ప్రజలకు ఉచితంగా చాపమందు ను పంపిణీ చేస్తున్నారని అన్నారు. చాప మందు కోసం వివిధ రాష్ట్రాల తో పాటు దేశ విదేశాల్లో ఉన్న అస్తమా రోగులకు ఎంతో విలువైన సేవలను బత్తినీ హరినాథ్ గౌడ్ అందించారని కొనియాడారు. ఆయన మరణం తీరని లోటని వెల్లడించారు. మంత్రుల వెంట ముషీరాబాద్ BRS పార్టీ యువజన నాయకులు ముఠా జై సింహ, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కురెళ్ళ వెములయ్య, రాష్ట్ర గౌడ సంఘాల సమన్వయ సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, BRS పార్టీ నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

read also : Randomisation Software : సాంకేతిక పరి జ్ఞానం తో లబ్దిదారుల ఎంపిక..

Leave A Reply

Your email address will not be published.