Read News in Telugu Language
adsdaksha

మెగాస్టార్ ఔదార్యం.. సీనియర్ జర్నలిస్ట్‌కు ఫ్రీగా ఆపరేషన్ చేయించిన చిరంజీవి.. ప్రశంసలు కురిపిస్తున్న నెటీజన్లు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మే 27

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ సీనియర్ సినిమా జర్నలిస్టుకు తన డబ్బుతో ఆపరేషన్ చేయించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాల్లోకెళితే హైదరాబాద్ ( hyderabad ) కు చెందిన సీనియర్ సినిమా జర్నలిస్ట్ ప్రభు ( journalist prabhu ) అనారోగ్యం బారీన పడడంతో హాస్పిటల్ లో చెకప్ చేయించుకున్నారు. అయితే అతడికి హార్ట్ లో 80% బ్లాకులు ఉన్నట్టు చెప్పిన డాక్టర్ లు యాంజియో గ్రామ్ చేసి బైపాస్ సర్జరీ చేయాలన్నారు. అయితే ప్రభు చిరంజీవికి బాగా క్లోజ్ అవ్వడంతో సెకండ్ ఒపీనియన్ కోసం చిరంజీవి (chiranjeevi ) ని సంప్రదించారు.

read also : బహుజన రాజ్యమే మారోజు వీరన్న కల .. సంఘటిత ఉద్యమాలు, పోరాటాలకు సిద్ధం కావాలి ..

Hospital

విషయం తెలుసుకున్న చిరంజీవి స్టార్ హాస్పటల్ డాక్టర్స్ కు ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లు చేయించి ప్రభుని అడ్మిట్ చేయించారు. బైపాస్ చేయాల్సిన పని లేకుండా స్టంట్స్ మాత్రం వేసిన డాక్టర్స్ ప్రాబ్లెమ్ క్లియర్ చేసారు. హాస్పిటల్ లో ప్రభుని ఒక్క రూపాయి కూడా కట్టనివ్వకుండా అన్ని తానై చూసుకున్నారు మెగాస్టార్. జర్నలిస్ట్ ప్రభు నేడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో జర్నలిస్ట్ ప్రభు చిరంజీవికి రుణపడి ఉంటాను అని కృతజ్ఞతలు చెప్పగా మిగిలిన జర్నలిస్టులు, సినీ ప్రముఖులు చిరంజీవికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు, నెటిజన్లు మరోసారి చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

read also : నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి..

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో హీరోగా అభిమానులను, ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేసి అండగా నిలిచారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. విపత్తుల సమయంలో, అభిమానులు, సినిమా వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు సాయం అందిస్తుంటారు. పలు హాస్పిటల్స్ తో మంచి సంబంధాలు ఏర్పరుచుకొని సినీ పరిశ్రమలోని యూనియన్స్ కు హెల్త్ కార్డులు ఇప్పిస్తుంటారు.

Leave A Reply

Your email address will not be published.