Read News in Telugu Language
adsdaksha

ఆదివాసీలు సంఘవిద్రోహ శక్తులకు సహకరించవద్దు.. నూతన వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వండి..

దక్ష న్యూస్, పినపాక : జనవరి 25

– సీఐ శివ ప్రసాద్
ఆదివాసీలు సంఘవిద్రోహక శక్తు లకు సహకారించవద్దని సీఐ శివ ప్రసాద్ ( ci shivaprasad ) కోరారు. పినపాక మండలం గోపాల రావు పేట గ్రామపంచాయతీ పరిధిలో గల చింతలపాడు వలస ఆదివాసి గ్రామంలో గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ శివప్రసాద్ మాట్లాడుతూ ఆదివాసి యువత సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు. మావోయిస్టులు మాయ మాటలు చెప్పి సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు పోతారని, అనంతరం అమాయకులైన ఆదివాసీలు కేసులతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. స్థానిక ప్రజలు, పోలిసుల కృషి ఫలితంగా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రస్తుతం వలస ఆదివాసి గ్రామాలు, పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాకుండా ప్రజల కష్టసుఖాల్లో పోలీసులు పాలు పంచుకుంటారన్నారు.

Hospital

Read also: హార్మోన్ల సమతుల్యత లోపమే అనారోగ్యానికి కారణం.. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి ..

మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆదివాసి గ్రామాల్లో సైతం వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని సిఐ శివప్రసాద్ అన్నారు. గ్రామాల్లో నూతన వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని మిరప కోతల విషయంలో నూతన వ్యక్తులు గ్రామాల్లోకి సంచరించే అవకాశం ఉందని అనుమానిత వ్యక్తుల వివరాలు వెంటనే పోలీస్ శాఖకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం గా ఉంచుతామన్నారు. డయల్ 100 కి గాని పోలీస్ శాఖ నెంబర్లకు గాని ఫోన్ చేయవచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటప్పయ్య, స్థానిక పోలీస్ సిబ్బంది సిఆర్పిఎఫ్ సిబ్బంది, పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.