Read News in Telugu Language
adsdaksha

పెండింగ్ చలానాల రాయితీకి రేపే లాస్ట్ డేట్..

దక్ష న్యూస్, పినపాక: జనవరి 9

– ఈ. బయ్యారం సీఐ శివప్రసాద్

జనవరి 10 వ తేదీతో పెండింగ్ చలానా ( challan ) పై రాయితీతో కూడిన సమయం ముగుస్తున్నందున వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ. బయ్యారం సీఐ శివ ప్రసాద్ ( ci shivaprasad ) వాహనదారులను కోరారు. ఆయన పినపాక మండలం ఈ. బయ్యారం క్రాస్ రోడ్ లో వాహనదారులకు అవగాహన కల్పించారు. రేపటిలోగా గడువు ముగుస్తుందని భారీ మొత్తంలో చలాన్లపై ప్రభుత్వం రాయితీని ఇచ్చినందున ఇలాంటి అవకాశాన్ని వాహనదారులందరూ ఉపయోగించుకొని, పెండింగ్ చలానాలను చెల్లించాలని ఆయన కోరారు.

Hospital

read also : విద్యుత్ కనెక్షన్ లు లేని గృహాలకు కనెక్షన్ లు ఇచ్చేలా చర్యలు చేపట్టండి : జిల్లా కలెక్టర్ గౌతమ్..

ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ముగిసిన తర్వాత ఎంత చలానా ఉందో అంత వాహనదారులు చెల్లించాల్సి ఉంటుందని సీఐ శివ ప్రసాద్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చలానా పెండింగ్ లో ఉన్న వాహనదారులు మీసేవ సెంటర్లలో, లేదా మీ మొబైల్ యాప్ లలో సైతం చెల్లించవచ్చని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.