Read News in Telugu Language
adsdaksha

కొత్త నటీనటులతో సికాడా.. నాలుగు భాషలు 24 విభిన్న ట్యూన్స్ తో సంచలనం ..

ఫస్ట్ లుక్ ఫోస్టర్ రిలీజ్ చేసిన చందూ మొండేటి, హీరో సోహెల్ ..

ఒకే టైటిల్, ఒకే కథ, 4 విభిన్న భాషలు, 24 విభిన్న ట్యూన్స్‌తో రాబోతోన్న చిత్రం సికాడా ( Cicada ). తెలుగులో ప్రస్తుతం పాన్ ఇండియన్ ప్రాజెక్టులు రూపొందుతున్న క్రమంలో అందరినీ ఓ కొత్త కాన్సెప్ట్‌తో అలరించేందుకు ‘సికాడా’ అనే చిత్రం రాబోతోంది. ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి, హీరో సోహెల్ చేతుల మీదుగా.. ‘సికాడా’ ఫస్ట్ లుక్ ( Cicada First Look ) పోస్టర్ ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి, యంగ్ హీరో సోహెల్ శనివారం రిలీజ్ చేశారు. విభిన్న కథాంశంతో ఒకే సారి నాలుగు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభంలోనే సంచలనాలు సృష్టించేలా కనిపిస్తోందని ఇప్పటికే టాక్ మొదలైంది. ఇక ఈ సినిమా పాటలకు రవితేజ అమరనారాయణ అద్భుతమైన సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి నవీన్ రాజ్ కొరియోగ్రాఫర్, శైజిత్ కుమారన్ ఎడిటర్.

Hospital

read also : అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ తిరుపతి మన్యంకొండ ..

తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ లో నటీనటుల లుక్స్, గెటప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సికాడా యూనిట్‌లో అంతా కూడా కొత్త వారే ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీజిత్ ఎడవనా దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. తీర్నా ఫిల్మ్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వందనా మీనన్, గోపకుమార్ పి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిత్ సిఆర్, గాయత్రి మయూర, జైస్ జోస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ బెంగుళూరు, అట్టపాడి, వాగమోన్, కొచ్చి తదితర ప్రాంతాల్లో జరిగింది. తెలుగు భాషలోనే కాకుండా కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీజిత్ ఎడవనా మ్యూజిక్ డైరెక్టర్‌గా “కాదల్ ఎన్ కవియే”, “నెంజోడు చేరు” వంటి తమిళ, మలయాళ సినిమాలకు పని చేశారు. ఇప్పుడు సికాడాతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మూవీ మేకర్స్ ప్రకటించనున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.