Read News in Telugu Language
adsdaksha

సీఏఏ ఆందోళన కలిగిస్తోంది ..అగ్రదేశం అమెరికా స్పందన..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 16

మన దేశంలో అమలవుతున్న సిటిజన్ షిప్ సవరణ చట్టం ( citizenship amendment act )  పై అగ్రదేశం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. సిఎఎ ( caa ) గురించి తాము ఆందోళన చెందుతున్నామని, దాని అమలును నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాకు తెలిపారు. ఇది ఎలా అమలు చేయబడుతుందో నిశితంగా పరిశీలిస్తున్నాం. మతస్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూడడం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రమని ఆయన అన్నారు.

Hospital

read also : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ..

ఇదిలావుండగా, డిసెంబర్ 31, 2014 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిఎఎ ని తీసుకువచ్చింది. దీనిని అమలులోకి తెస్తూ ఈ నెల 11న నోటిఫికేషన్ జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.