Read News in Telugu Language
adsdaksha

christmas : క్రీస్తు బోధనలు ఆచరనీయం.. క్రీస్తు మార్గం అనుసరణీయం..

దక్ష న్యూస్, హైదరాబాద్ : డిసెంబర్ 24

క్రైస్తవులకు సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి, డిప్యూటీ సీఎం భట్టి శుభాకాంక్షలు..

యేసు ప్రభువు బోధనలు శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం, ఎప్పటికి అనుసరణీయమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ( cm revanth reddy ) అన్నారు. క్రిస్మస్ ( christmas ) పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర క్రిస్టియన్ సోదర సోదరీమనులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రములో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందని, మతసామరస్యాన్ని కాపాడుకుంటూ, పరిపాలన పారదర్శకంగా, ప్రజాస్వామికంగా సాగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. క్రిస్టియన్ సోదరులు సంతోషంగా, ఆనందోత్సహాలతో క్రిస్మస్ ను జరుపుకోవాలని, క్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధికై అందరు పాటుపడాలని కోరారు. క్రీస్తు బోధనలు ఆచరనీయమని క్రీస్తు మార్గము అనుసరణీయం అని సీఎం వ్యాఖ్యానించారు.

పొంగులేటి శుభాకాంక్షలు..

Hospital

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. యేసుక్రీస్తు జన్మించిన రోజును క్రిస్టియన్లు ఎంతో భక్తి, శ్రద్దలతో జరుపుకుంటారని చెప్పారు. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని, ఏసుక్రీస్తు చల్లని దీవెనలు ప్రజలకు ఎల్లప్పుడూ మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. నిరుపేదలు పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రభుత్వం క్రిస్మస్ బహుమతులు అందచేసినట్లు చెప్పారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్రిస్మస్ శుభాకాంక్షలు:

read also : రేవంత్ మార్క్ పాలన షురూ.. కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో అదిరిపోయే ప్రసంగం చేసిన సీఎం..

విశ్వ మానవాళికి ప్రేమను, కరుణను పంచిన యేసు క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 25న క్రిస్మస్ పండుగ నిర్వహించుకునే క్రైస్తవులందరికీ తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శుభాకాంక్షలు తెలిపారు
. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. ఏసు శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటారన్నారు. ఒక వైపు శాస్త్ర, సాంకేతిక రంగాలు గొప్పగా పురోగమిస్తున్నా, మరోవైపు మానవీయ విలువలు మృగ్యమైపోతున్న నేటి కాలంలో, క్రీస్తు బోధనలు ఆచరణీయమని తెలిపారు. శత్రువునైనా క్షమించే గొప్ప గుణం ఉండాలని క్రీస్తు బోధించారని, సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, సహనం అనే సద్గుణాల ఆచరణ అనివార్యమైందని అన్నారు. ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరికీ లభించాలని ఆకాంక్షించారు.

 

Leave A Reply

Your email address will not be published.