Read News in Telugu Language
adsdaksha

voa : వీ వో ఏ లకు ముఖ్యమంత్రి రాఖీ పండుగ కానుక..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఆగస్ట్ 31 జారీ అయిన జీ.వో...

జీతాలు పెంచుతూ సిఎం నిర్ణయం.. జారీ అయిన జీ.వో…

జీవిత బీమా అమలు కి సానుకూలంగా స్పందించిన సీఎం..

రాఖీ పండుగ కానుకగా సీఎం కేసిఆర్ ( cm kcr ) వీవోఏ ( voa ) ల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సబంధించి మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై ప్రకటించాలని మంత్రి హరీశ్ రావు ( harish rao ) కు సిఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సిఎం నిర్ణయం మేరకు మంత్రి హరీశ్ రావు సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు ( errabelli dayakar rao ), సబితా ఇంద్రారెడ్డి ( sabitha indra reddy ), సత్యవతీ రాథోడ్ ( sathyavathi radhod )  లతో కలిసి మహిళా సంఘాల సహాయకులతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ నిర్ణయాలు మంత్రి వారికి వెల్లడించారు. అయితే పెరిగిన జీతాల మేరకు వీవోఏల వేతనాలు నెలకు రూ. 8000 కు పెరగనున్నాయి. దాంతో సంతోషం వ్యక్తం చేసిన వీవోఏ లు గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోని తమను ఆదరిస్తూ ఆసరానందిస్తూ భరోసాగా నిలిచినందుకు సిఎం కేసీఆర్ కి రుణపడి వుంటామన్నారు.

రక్షా బంధన్ కానుకగా, రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకు(వీ వో ఏ) ల వేతనాలను పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సిఎం నిర్ణయం మేరకు వీవోఏల వేతనాలు నెలకు రూ. 8000 కు పెరగనున్నాయి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 17,608 మంది ఐకేపీ ( ikp ) మహిళా సంఘాల సహాయకు ( వీ వో ఏ) లకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన వేతనాలు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి రానున్నాయి. వేతన పెంపు ద్వారా ఏడాదికి రూ. 106 కోట్లు ప్రభుత్వ ఖజానా పై అదనపు భారం పడనున్నది. అయినా ఖర్చుకు వెనకాడకుండా మహిళా సంక్షేమమే ధ్యేయంగా సిఎం కేసీఆర్ మానవీయ కోణంలో వేతన పెంపు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

 

Hospital

ఇతర విజ్జప్తులనూ అంగీకరించిన సిఎం :

తమ జీతాలు పెంచాలని, తమకు ప్రతి మూడునెల్లకోసారి అమలవుతున్న రెన్యువల్ విధానాన్ని సవరిస్తూ దాన్ని ఏడాదికి పెంచాలని, వీవోఏలు ప్రభుత్వానికి విజ్జప్తులు చేశారు. అయితే వాటిని తక్షణమే పరిష్కరిస్తూ సిఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాగా వారికి జీవిత బీమా కూడా అమలు చేయాలనే విజ్జప్తికి సిఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

తాము యూనిఫాం డ్రెస్ విధానాన్ని అనుసరిస్తామని, అందుకోసం నిధులు విడుదల చేయాలని మహిళా సంఘాల సహాయకుల అభ్యర్థన మేరకు ఏడాదికి రూ. 2 కోట్లు నిధులను అందించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. మహిళా సంఘాల సహాయకుల విధులకు సంబంధించి, ప్రతి మూడు నెల్లకు ఓసారి చేసే రెన్యువల్ విధానాన్ని ఇకనుంచి ఏడాదికి చేసేలా సవరించాలని సిఎం నిర్ణయించారు. అంతేకాదు, వీఏవోలు తమకు జీవిత బీమా అందించాలని సిఎం చేసుకున్న విజ్జప్తికి సానుకూలంగా స్పందించిన సిఎం ఇందుకు సంబంధించిన విధి విధనాలను అధ్యయనం చేసి నివేదిక అందించాలని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఆదేశించారు.

సమావేశంలో పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈవో గౌతమ్ పొట్రు, పలువురు వీఏవో మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.