Read News in Telugu Language
adsdaksha

ఉపేందర్ రెడ్డిని అసెంబ్లీ వాకిలి దాటియ్యండి.. పాలేరు ప్రజా ఆశీర్వాద సభ లో కేసిఆర్..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 27

ఉపేందర్ రెడ్డి ప్రజలతో మాట్లాడుతుంటే విన్నానని, అది ఉపన్యాసం మాదిరిగా లేదు.. స్వంత మనుషులతో రోజు ఎట్లా మాట్లాడుతున్నారో అట్లాగే ఉందని బిఆర్ఎస్ ( brs ) అధినేత కేసిఆర్ (kcr ) అన్నారు. నా సెల్ ఫోన్ నంబరు మీ దగ్గర ఉందా అని అడిగినారు. రాజకీయాల్లో ఇంత చొరవగా, చనువుగా ప్రజల్లో కలిసిపోయి మాట్లాడే నాయకులు తక్కువగా ఉంటారు. మీకు  కందాల ఉపేందర్ రెడ్డి ( kandala upender reddy ) ఉన్నారు. అదృష్టవంతులు అంటూ వ్యాఖ్యానించారు. పాలేరు ( paleru ) నియోజకర్గంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభకు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,

తెలంగాణ ఏర్పాటు కోసం 24 ఏండ్ల క్రితం జెండా లేపి ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించినం అన్నారు. ఆసమయంలో చాలా మంది అవహేళన చేశారని, అవమాన పరిచారని అన్నారు. ఎక్కడి నుంచి వస్తది తెలంగాణ ఎట్ల వస్తది అన్నారు. సాధ్యం కాదన్నారు. కేసీఆర్ బక్క పల్చనోడు, ఎవడో బొండిగ పిసికి చంపేస్తరు. ఇది అయ్యేదా పొయ్యేదా అని మాట్లాడారు. 14 సంవత్సరాల పోరాటం తర్వాత యావత్తు తెలంగాణ ఒక ఉప్పెనై కదిలితే భారత రాజకీయ వ్యవస్థ తలవంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి సృష్టిస్తే తెలంగాణ వచ్చిందన్నారు.

read also : పెద్ద పాలేరు ఇప్పుడు ఎవరికి పాలేరు..?

కాంగ్రెస్ పార్టీ డోకా చేస్తే కేసీఆర్ శవయాత్రనా.. తెలంగాణ జైత్ర యాత్రనా ఏదో ఒకటి జరుగాలని ఆమరణ దీక్షకు కూర్చుంటే నన్ను అరెస్టు చేసి తెచ్చి ఖమ్మం జైళ్లో పెట్టిన సంగతి మీకు తెలుసని కేసిఆర్ అలనాటి సంగతులు గుర్తు చేశారు. అనేక మోసాలు, ఇచ్చిన మాట భంగం చేసి కాంగ్రెస్ పార్టీ డోకా చేసినా మనం అలుపులేని పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం అన్నారు. తెలంగాణ వచ్చిన ఫలితమేందో పాలేరు ప్రజలకు తెలుసు. భక్త రామదాసు లిఫ్టు ప్రారంభానికి వస్తుంటే నేను కూడా వస్తాను సార్ అని మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వచ్చారు. నాది కూడా పాలేరు నియోజకవర్గమే సార్ 45 ఏండ్లలో 40 సంవత్సరాలు కరువు కాటకాలు ఎదుర్కున్నది. పాలేరు కు మీరు నీరందిస్తున్నారు. సంతోషంతో నేను పాల్గొంటా అని వచ్చారన్నారు.

Hospital

బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు రాష్ట్రంలో చాలా పార్టీలు రాజ్యం చేశాయని కేసిఆర్ అన్నారు. పాలేరు ఖర్మానికి వదిలేశారు. మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. పాలేరు మోక్షం జరిగిందంటేనే బీఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భక్తరామదాసు పూర్తికావడంతో నీళ్లు అందుతున్నాయన్నారు. మిషన్ కాకతీయ వల్ల పాలేరు నియోజకవర్గంలో ఎండిపోయిన చెరువులు ఎండాకాలంలో కూడా నిండి కనబడుతున్నాయని కేసిఆర్ అన్నారు. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ వల్లనే పాలేరుకు మోక్షం వచ్చిందన్న నాలుకలు, ఇప్పుడు ఉల్టా మాట్లాడుతున్నయి. నరం లేని నాలుక మారవచ్చు కానీ సత్యం మారదు కదా. నిజం నిజంగనే ఉంటది.. నిజం నిప్పులాంటిది అన్నారు. లంబాడీ తండాలను గ్రామపంచాయతీలను చేసిందెవరో మీకు తెలుసు. దశాబ్ధాల పాటు ఎవరూ మీ వైపు చూడలేదు. 40 తండాలు పాలేరు లో కూడా గ్రామ పంచాయతీలుగా మారినాయి. లంబాడీ బిడ్డలు వాళ్ల తండాల్లో వాళ్లే రాజ్యం చేస్తున్నారని గర్వంగా చెబుతున్నానన్నారు.

read also : బిఆర్ఎస్ మ్యానిఫెస్టో తో ప్రజలకు ఎంతో మేలు : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

పాలేరులో భక్త రామదాసు ప్రాజెక్టుకు ముందు భూముల ధరలు కేవలం రూ. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉండేది. ఈ రోజు ఎకరా రూ.30 నుంచి 50 లక్షల వరకు పలుకుతున్నది అని పేర్కొన్నారు. ఎవరి వైఖరి ఏంటో గమనించి ఓటింగ్ లో పాల్గొనాలని, ఎవరు చెప్పారనో ఓటు వేయవద్దన్నారు. అనేక రకాలుగా పార్టీలు మారుతారు. పదవుల కోసం , అవకాశాల కోసం పార్టీలు మారి మాటలు మార్చు వారున్నారు. ఇటువంటి వాళ్లు మన మధ్యనే ఉన్నారు. ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించింది. అభివృద్ధి చేసింది. ప్రజల కోసం మానిఫెస్టోలో ఏ ఏ అంశాలు పెట్టిందో ఆలోచించాలి.

కమ్యూనిస్టులు చాలాకాలం ఎమ్మెల్యేలు గా ఉన్న ప్రాంతం, ఉద్యమాలు జరిగిన ప్రాంతం. చైతన్యంతో ఓటు వేయాలి. సర్వ జనుల సంక్షేమం కోసం పనిచేసిన వారిని గెలిపిస్తేనే ప్రజలు గెలుస్తారు. డబ్బు కట్టల అహంకారంతో వచ్చే వాళ్లకు పిచ్చి రాజకీయాలతో వచ్చే వాళ్లకు మాటలు మార్చు వారికి, పూటపూటకు పార్టీలు మార్చే వారికి అవకాశం ఇస్తే వాళ్లు గెలుస్తరు కానీ ప్రజలు గెలువరన్నారు.

ఎన్నికల్లో క్వాలిటీ రావాలని, ప్రజా స్వామ్యంలో నీతి నిజాయితీకి పట్టం కట్టే చైతన్యం రావాలని కేసిఆర్ అన్నారు. అప్పుడే ప్రజలకు వాస్తవమైన సేవ దొరుకుతుందన్నారు. సీతారామా ప్రాజెక్టు త్వరలో పూర్తికాబోతుందని, పాలెరుకు కనెక్టు కాబోతుందన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే సాగర్ కెనాల్ ఆయకట్టు కింద ఉన్న ఖమ్మం జిల్లాలో కరువు పీడ, నీళ్ల పీడ తీరిపోతుందన్నారు. పాలేరులో కరువు తొంగి చూడదన్నారు. ఉపేందర్ రెడ్డి ని అసెంబ్లీ వాకిలి దాటియ్యమని కోరారు. సభలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు, పార్లమెంటు సభ్యులు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, దేశపతి శ్రీనివాస్, మధుసూధన చారి, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.