Read News in Telugu Language
adsdaksha

బీజేపీ ఈడీని వాడుకుంటోంది.. ప్రభుత్వాలను పడగొట్టేందుకు ప్రయత్నిస్తోంది: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 9

వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఢిల్లీ ( delhi ) సీఎం కేజ్రీవాల్ (cm kejriwal ) అన్నారు. గురువారం జంతర్ మంతర్ ( janthar manthar ) వద్ద ఆందోళన వ్యక్తం చేసిన పినరయి విజయన్ సర్కార్.. నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందంటూ ఆరోపించింది. ఈ ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ…. ప్రతిపక్ష పార్టీల ప్రభత్వాలను బీజేపీ ( bjp ) కూల్చిందని, ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అందుకోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను వాడుకుంటోందని విమర్శించారు.

Hospital

read also : కేసీఆర్ కు హరీశ్ వెన్నుపోటు ఖాయం .. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది టచ్ లో ఉన్నారు: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ..

త్వరలోనే తనతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా జైల్లో పెట్టి ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టే అవకాశం ఉందని కేజ్రీవాల్ అన్నారు. గతంలో ఎవరిపైన అయినా నేరం రుజువైతే జైలుకు పంపేవారని, కానీ ప్రస్తుతం వారిని జైలుకు పంపిన తర్వాత ఏ కేసు పెట్టాలా అని ఆలోచిస్తున్నారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.