Read News in Telugu Language
adsdaksha

రేవంత్ మార్క్ పాలన షురూ.. కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో అదిరిపోయే ప్రసంగం చేసిన సీఎం..

దక్ష న్యూస్, హైదరాబాద్ : డిసెంబర్ 24

అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు..పౌరుల నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ది : సీఎం రేవంత్ రెడ్డి

అభివృద్దిని దృష్టిలో పెట్టుకోకపోతే ఇక్కడి ప్రజల రియాక్షన్ చాలా వైల్డ్ గా వుంటుంది..

8 పనిదినాల్లో గ్రామ సభలు..

అధికారులు ప్రజలచేత శభాష్ అనిపించుకున్నంతవరకే ఈ ప్రభుత్వం మీతో ఫ్రెండ్లీగా ఉంటుంది..

అభివృద్ది చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ది. అద్దాల మేడలు కట్టో.. రంగుల గోడలు చూపించో.. అభివృద్ది జరిగిందని ఎవరైనా భ్రమపడితే… తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నిజమైన అభివృద్ది అనేది పౌరులయొక్క సమగ్రాభివృద్ది జరిగినప్పుడే… చివరి వరసలో వున్న పేదవారికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం గానీ, దేశం గానీ అభివృద్ది చెందినట్లు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ..అని కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పిన విషయాల్నితెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( cm revanth reddy ) ప్రస్తావించారు. అంతే కాదు, ఈరోజు చివరి వరుసలో నిలబడ్డ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో వుండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలంటే, చేరవేయవలసిన వారధి మీరే.. మీమీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో విశ్వాసంతో ఈ అభయ హస్తం ద్వారా అమలు చేయబోయో ఆరు గ్యారంటీలను అమలు చేయాలనుకుంటోందని, దానికి సంబంధించి వినతిపత్రాలనుస్వీకరించాలనే కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలియజేశారు.

ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే.. అధికారులు, ప్రజాప్రతినిధులు సేవకుల్లాగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా మనం ప్రయాణం చేసే అవకాశం వుంటుందన్నారు. ఇందులో ఏది కాస్త వెనుకా ముందు చేసినా సరైన పనులు చేయకపోయినా, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేమన్నారు. ఎన్నికలలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడానికి..సచివాలయంలో ఏ నిర్ణయం జరిగినా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లది, పోలీస్ అధికారులది అని తెలిపారు. పత్యక్షంగా ప్రజలతో సంబంధాలు కలిగి వుండాల్సినవాళ్లు వుండే వాళ్లు జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు అన్నారు. ప్రజాపాలన మీద గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్దిదారులను గుర్తించి నిస్సహాయులకు సహాయం అందించాలని ఆలోచనతో, ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రజా పాలన గురించి చెప్పిన అంశాల్ని గుర్తు చేశారు.

read also : ఇంటర్ ప్రాక్టికల్స్ జంబ్లింగ్ పై మళ్లీ కన్ఫ్యూజన్ .. ఏటా వాయిదా వేస్తున్న ఇంటర్ బోర్డు..

సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన అఖిల భారత సర్వీసెస్ అధికారుల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు మనమందరం గుర్తు చేసుకోవాల్సింది ఎస్.ఆర్. శంకరన్ గారినే అని రేవంత్ రెడ్డి అన్నారు. వారు జీవితకాలం సచివాలయానికి ఉదయం 9.30 గంటలకు నడుచుకుంటూ వచ్చి రాత్రి వరకు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతీ పైల్ ను క్షుణ్ణంగా పరిశీలించి, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వారని తెలిపారు. అఖిల భారత సర్వీసెస్ అధికారులకు ఎస్. ఆర్. శంకరన్ ఒక ఆదర్శప్రాయమైన అధికారిగా నిలబడ్డారన్నారు. మీరు ప్రతిరోజు ఉదయం విధులకు ముందు ఎస్ఆర్ శంకర్ ను గుర్తు తెచ్చుకుంటే తప్పకుండా మన విధానంలో మార్పు వస్తుందని, ప్రజలకు అది ఉపయోపడుతుందని నేను బలంగా నమ్ముతున్నానన్నారు.

Hospital

ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రెండ్లీగవర్నమెంట్ అంటే అధికారులు ప్రజలచేత శభాష్ అనిపించుకున్నంతవరకే ఈ ప్రభుత్వం మీతో ఫ్రెండ్లీగా వుంటుంది. మీ పరిపాలనలో నిర్లక్ష్యం వహించినా.. లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నింటిని కూడా సమీక్షించడం జరుగుతుందన్నారు. ఈ రాష్ట్ర నిర్మాణంలో కీలకపాత్ర పోషించడానికి మీరు ఈ రాష్ట్రానికి వచ్చిండ్రు. మాది ఏదో రాష్ట్రమనో, భాష వేరే అని మీరెవరు భావించవలసిన అవసరం లేదు. మేము ఎవరమూ కూడా మిమ్మల్ని ఆ రకంగా చూడడం లేదు. భాషను తెలుసుకోండి.. ప్రజల మనసులను గెలుచుకోండి. ప్రజల మనసులు మీరు గెలిచి విశ్వాసంతో నమ్మకంతో పనిచేయండి. జవాబుదారితనంతో వ్యవహరించండి అని దిశానిర్ధేశం చేశారు.

అధికారులు రూల్స్ ను మేము అమలు చేస్తున్నామని అనుకోవడం కంటే కూడా మనకు బాధ్యత ఇచ్చింది.. మనం ఈ కుర్చీలో కూర్చున్నది ఆ ప్రజల సమస్యలను పరిష్కంచడానికే అని మీరు భావించాలని సీఎం అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లాలన్నారు. తెలంగాణ రాష్ట్రం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మీరు గత 20 సంవత్సరాలనుండి ఇక్కడి ప్రజలతో మమేకమై వున్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలు వివిధ కారణాలు, ప్రత్యేకమైన రాజకీయవసరాలతో కానీ ఏర్పడ్డాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ప్రత్యేక రాష్ట్రంగా అవతరణ జరుగలేదు. కోట్లాదిమంది ప్రజలు కోరుకున్నారు. లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమబాట పట్టిండ్రు. వందలాది మంది అమరులై నేలకొరిగితే ఈ రాష్ట్రం ఏర్పడింది. ఎంతో బలమైన ఆకాంక్ష వుంటే తప్ప ఎవరూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టుకుని తమ రాష్ట్రాన్ని సాధించుకోరు. ఈ దేశంలో వుండే మిగతా రాష్ట్రాలకంటే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ప్రత్యేకత వున్నది. ఇక్కడి డిఎన్ఎ దేన్నైనా సహిస్తుంది కానీ, స్వేచ్చను హరించాలన్న ఆలోచనతోటి, సామాజిక న్యాయాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించదన్నారు.

రాష్ట్ర అభివృద్దిని దృష్టిలో పెట్టుకోకపోతే ఇక్కడి ప్రజల రియాక్షన్ చాలా వైల్డ్ గా వుంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలు సామాన్యమైన పరిస్థితుల్లో చాలా సబ్ హెసివ్ గా, చాలా గౌరవంగా, మర్యాదగా ఏ విధంగా వ్యవహరిస్తారో మీరందరూ చూసిండ్రు. అదే సమయంలో వాళ్లు ఏమి ఆలోచన చేస్తుండ్రో మనం అర్థం చేసుకోకపోతే ప్రజలల్లో ఒకరకమైన చైతన్యం వుంది. ఆ చైతన్యం అనేది ఎంతటి వారినైనా కూడా ఇంటికి పంపింస్తుందన్నారు. మీరు ప్రజల్లోకి వెళ్లేట్పప్పుడు, కలిసేటప్పుడు ఈ ప్రత్యేకమైన రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులను ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోని వుండాలన్నారు.

ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజాపాలనలో ప్రజల సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 8 పనిదినాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంపూర్ణమైన సహకారం మీవైపు నుంచి వుండాలని కలెక్టర్లను కోరారు. తెలంగాణ రాష్ట్రం గతంలో ఉద్యమ నేపథ్యం వున్నరాష్ట్రం అని గతంలో ఇక్కడ రకరకాల భావజాలంతోని, పౌర హక్కుల కోసం ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ సంఘాలు ప్రభుత్వాలు నిషేధించిన సంస్థలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తరపున పోరాటాలు చేశాయన్నారు. ప్రభుత్వం చట్టాలు అమలు చేసేటప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని వుండొచ్చు.. పోలీసు అధికారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేటప్పుడు కఠినంగా వ్యవహరించి వుండొచ్చు. అప్పుడప్పుడు నేను టీవిల్లో, పేపర్లలో చూస్తున్నాను.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని… ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరితోటి… పౌరునితో వుండాలి.. క్రిమినల్స్ తో కాదన్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్, ప్రెండ్లీ అప్రోచ్ అనేది క్రిమినల్స్ తో కాదు.. గంజాయి, హెరాయిన్, కొకైన్ వాడే వాళ్లతో ఫ్రెండ్లీగా వుండమని కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అర్థం. నేరాలు, హత్యలు చేసిన వాళ్లు పోలీస్ స్టేషన్ కు వస్తే..వాళ్లను ఫ్రెండ్స్ లా ట్రీట్ చేయమని కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే….సామాన్యమైన పౌరుడు పోలీస్ స్టేషన్ కు వస్తే ఫిర్యాదు చేయడానికి వస్తే అతను ఏమి చెప్తున్నాడో… వాళ్లను కూర్చోబెట్టి మర్యాదగా వాళ్లను అడిగి తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను మిస్ యూస్ చేసినా అబ్యూస్ చేసినా…ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. అందరూ పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి.. భూ కబ్జాలు, నేరాలు, డ్రగ్స్ మాఫీయా… ఉద్యమ నేపథ్యం వున్న తెలంగాణ రాష్టంలో పెరిగిపోయింది. ఈరోజు చిన్నచిన్న పట్టణాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది. జూనియర్ కాలేజీల్లో, స్కూళ్లలో కూడా ఈరోజు మత్తు పదార్ధాలు అందుబాటులోకి వచ్చినయ్.. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి.. ఇట్లాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం క్షమించదన్నారు.

మీరు గతంలో తీవ్రవాదులను, ఐఎఐ లాంటి వాళ్లను కూకటి వేళ్లతో పెకిలించడానికి, నిర్మూలించడానికి ఏ రకంగా అయితే కఠినమైన చర్యలు తీసుకున్నారో.. వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారో.. ఈరోజు ఈ డ్రగ్ మహమ్మారినికి కూడా నిర్మూలించేందుకు అలా కృషిచేయాలని పోలీస్ అధికారులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అడీషినల్ స్థాయి అధికారులను నియమించాం.. కింది స్థాయి వ్యవస్థలను కూడా బలోపేతం చేసే అధికారులను నియమిస్తాం. గ్రేహండ్స్ , ఎసిబి, సైబర్ క్రైమ్ వంటివి ఏ పర్పస్ కు స్టార్ట్ చేసిండ్రో… విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏ పర్పస్ కు స్టార్ట్ చేసిండ్రో.. ఆయా సందర్భాలలో, ప్రమాణాల ప్రకారం అప్పటి ప్రభుత్వం యొక్క అవసరాలను బట్టీ ఆ సంస్థలను పోలీస్ విభాగంలో అడిషినల్ పవర్స్ వారికిచ్చుకుంటూ ఎదైతే ఏర్పాటు చేసిండ్రో.. ఈరోజు ఒక గ్రేహండ్స్, ఎసిబి, సైబర్ క్రెం వీటిన్నింటిని కలిపితే.. ఇక్వల్ టూ టిఎస్ న్యాక్.. అంటే నార్కోటిక్ బ్యూరో అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం వున్నదన్నారు.

మన కళ్లముందు కుప్పకూలిపోయిన పంజాబ్ రాష్ట్రం కనిపిస్తున్నది. తెలంగాణ పంజాబ్ రాష్ట్రం వంటి పరిణామాల వైపు వేగంగా ప్రయణిస్తున్నది. దీన్ని నిషేదించి నిర్మూలించాల్సిన బాధ్యత మన పోలీస్ అధికారులది. నాకు కొంత అవగాహన వున్నది.. నేను ప్రజల్లో తీరుగుతూ వున్నాను. ఎక్కడ ఎమి జరుగుతుందో పోలీస్ అధికారుల వద్ద సమాచారం వుందో లేదో కానీ, స్వయంగా నా దగ్గర కొంత సమాచారం వుంది. పోలీస్ శాఖకు, అధికారులకు నేను ఇక్కడి నుంచి ఇచ్చే ఆదేశాలు మీరు ఉక్కు పాదంతో అణిచివేయాల్సిన అవసరం వుంది. గంజాయి అనే పదం ఈరాష్ట్రంలో వినిపించకూడదు. ఉద్యమనేపథ్యం వున్న తెలంగాణలో గంజాయి లాంటివి, డ్రగ్స్ లాంటివి ఇక్కడొచ్చి ఇక్కడి యువతను ఆక్రమించుకుంటున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం అని సీఎం వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.