Read News in Telugu Language
adsdaksha

మెట్రో విస్తరణపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి ..

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 2

ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయకుండా,  స్ట్రీమ్ లైన్ చేస్తామని సోమవారం ఓ కార్యక్రమములో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు…

Read also: టీమ్ ఇండియా 2024 షెడ్యూల్ ఇదే..

శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గించి, బిహెచ్ఈఎల్ ( Bhel ) నుంచి ఎయిర్ పోర్టు వరకు (32) కిలోమీటర్ల వరకు మెట్రో వేస్తామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.

అలాగే, మహాత్మ గాంధీ బస్టాండ్ నుండి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో ఉంటుందని పేర్కొన్నారు.

Read also: ఏపీ లోనూ ఆర్టీసి బసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..

నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓఎస్ హాస్పిటల్ మీదుగా చంద్రాయణ గుట్ట వద్ద ఎయిర్ పోర్ట్ కు వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేస్తామన్నారు.

Hospital

అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రో పొడిగిస్తామని సీఎం చెప్పారు.

ఫార్మాసిటీ, రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రత్యేక కస్టర్ల వద్ద పరిశ్రమల్లో పనిచేసే వారికి ఇళ్ల నిర్మాణం కూడా చేపడుతామన్నారు.
వంద పడకల ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుందన్నారు.

Read also: ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన చిన్నారి..

*జనవరి 3న విస్తృత స్థాయి సమావేశం*

జనవరి 3వ తేదీన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుందని, పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.