Read News in Telugu Language
adsdaksha

ముఫైరోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్..

దక్ష న్యూస్, హైదరాబాద్ : జనవరి 7

తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి నెల రోజులు అవుతోంది. ఈనెల రోజుల పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ తనదైన మార్క్ ను చూపిస్తూ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలనలో ముందుచూపుతో దూసుకెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ( cm revanth reddy ) నెల రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా తన నెలరోజుల పాలనపై రేవంత్ రెడ్డి ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

read also : ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ లకు కూడా ఖాకీ యూనిఫామ్ ఇవ్వాలి : ఐ ఎఫ్ టి యు

Hospital

సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈనెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని రేవంత్ అన్నారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. పేదల గొంతుక వింటూ… యువత భవితకు దారులు వేస్తూ… మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ… రైతుకు భరోసా ఇస్తూ… సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందని రేవంత్ ట్వీట్ లో పేర్కొన్నారు.

read also : ఏ పీ అంగన్వాడీల సమ్మె పై ఎస్మా..

పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ… పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ… నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ… మత్తులేని ఛైతన్యపు తెలంగాణకోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని అన్నారు. రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్నారు.. తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందుకూడా నా బాధ్యత నిర్వర్తిస్తానని రేవంత్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు. చివరిలో మీ రేవంతన్న అంటూ రాశారు.

Leave A Reply

Your email address will not be published.