Read News in Telugu Language
adsdaksha

10న రాష్ట్ర బడ్జెట్.. రేపు కేబినెట్ భేటీ..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 3

మంత్రివర్గ భేటీలో మరో రెండు గ్యారెంటీలకు ఆమోదం..

ఈ నెల 10న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ( cm revanth reddy ) అధ్యక్షతన ఈనెల 4 (ఆదివారం)న కేబినెట్ భేటీ కాబోతోంది. తెలంగాణ ( Telangana ) అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన గ్యారంటీల అమలుతో పాటు బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ సమావేశంలో డిస్కషన్ జరగనుంది.

Hospital

బడ్జెట్‌ పద్దుకు ఆమోదం, సమావేశాలు ఎప్పటి నుంచి, ఎప్పటి వరకు నిర్వహించాలి? తదితర అంశాలపై చర్చించనున్నారు ఈనెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 9న గవర్నర్ బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేయనుండగా, 10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 11వ తేదీ(ఆదివారం) సెలవు నేపథ్యంలో 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది.

Read also: విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. తమిళనాట కొత్త రాజకీయ పార్టీ..

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే రెండు హామీలను ప్రభుత్వం అమలు చేసింది. ఈ నేపథ్యంలోనే మరో రెండు హామీలను నెరవేర్చేందుకు ఆదివారం కేబినెట్ భేటీ ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.