Read News in Telugu Language
adsdaksha

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 వేల పెన్షన్ : సీఎం రేవంత్ రెడ్డి ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 4

పద్మశ్రీ అవార్డు గ్రహీతలను తమ ప్రభుత్వం గౌరవిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( cm revanth reddy ) అన్నారు. వారికి ప్రతి నెల రూ. 25 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. అదే విధంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.

Read also: ఫాస్టాగ్ గడువు పెంపు.. ఈనెల 28వరకు ఈ-కేవైసీ చేసుకోవచ్చు..

కవులు, కళాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత అని రేవంత్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల కళాకారులను మరింత ప్రోత్సహిస్తామని వెల్లడించారు. అవార్డులతో మట్టిలో మాణిక్యాల ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. శిల్పకళావేదికలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున నిర్వహించిన కార్యక్రమం లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ చప్పట్లు, దుప్పట్లు కాదు కళాకారులకు నగదు సాయం కూడా అందిస్తామని తెలిపారు. సంప్రదాయాలు, భాషను గౌరవించుకునే విషయంలో మనమంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.

Hospital

Read also: అద్వానీకి భారతరత్న.. ప్రధాని మోడీ కీలక ప్రకటన..

వెంకయ్య నాయుడికి సన్మానం అంటే మనల్ని మనం సన్మానించుకోవడమేనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీ వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్య నాయుడు పెద్ద దిక్కన్నారు. ఆయనకు రాష్ట్రపతి అయ్యే అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. చిరంజీవి కమిట్ మెంట్ ఉన్న నటుడని సీఎం చెప్పారు. పున్నమినాగులో ఏ స్థాయిలో నటించారో.. సైరాలోనూ అదే స్థాయిలో నటించారని కొనియాడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిరంజీవి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. గొప్ప వ్యక్తుల పోత్సాహంతో ప్రజాపాలన కొనసాగిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Read also: గృహనిర్మాణ శాఖ ఉద్యోగులను నా కుటుంబ సభ్యులుగా చూస్తా : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం జరిగింది. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పద్మశ్రీ అవార్డులు అందుకోనున్న వారిని సీఎం, మంత్రులు సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.