Read News in Telugu Language
adsdaksha

మరో రెండు గ్యారెంటీలు..? అమలుకు సర్కార్ ప్లాన్..

దక్ష న్యూస్, హైదరాబాద్: పిబ్రవరి 5

మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం..

తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు బస్సు ఫ్రీ, ఆరోగ్యశ్రీలో 10లక్షల వరకు ఉచిత వైద్యం వంటి ఈరెండింటిని గవర్నమెంట్ ఏర్పాటైన రెండు రోజులకే అమలు చేసిన సంగతి తెలిసిందే. వంద రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి మరో రెండు స్కీమ్ లు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి ఆదివారం భేటీ అయిన క్యాబినేట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

Hospital

read also : 7 న ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం పై అవగాహన సదస్సు..

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( cm revanth reddy ) అనౌన్స్ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, 10న బడ్జెట్ ప్రవేశపెట్టాలని తీర్మానించింది. ఈ సమావేశాల్లోనే పై రెండు హామీల అమలుపై ప్రకటన చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం మూడు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రివర్గం ఆమోదించిన అంశాలను మీడియాకు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.